ఆరు నెలల నుంచి తిరుగుతున్న బోధన్ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు
బోధన్
గత ఆరు నెలల నుంచి బోధన్ మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగటం లేదని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రాజ్ విటల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16వ వార్డులో ఓ వ్యక్తి ప్రభుత్వ జాగా అయిన సిసి రోడ్డు కబ్జా చేసుకొని మెట్లు వేయడం జరిగిందని ఈ విషయమై బోధన్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఆరు నెలల నుంచి పట్టించుకోక పోగా కబ్జాదారుడికి వత్తాసు పలుకుతున్నారని చేప్పులు అరిగేలా తిరుగుతున్న సంబంధిత శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని ప్రభుత్వ స్థలం కాపాడడంలో బోధన్ మునిసిపల్ అధికారులు పూర్తిగా వైఫల్యం అయ్యారు అని ఆయన అన్నారు. అధికారుల తీరుకు నిరాశ చెందిన తాను హైకోర్టును ఆశ్రయించగా నోటీసులు వెళ్లడంతో వచ్చి కబ్జాదారుడికి నోటీసు పంపించారు కానీ పూర్తిగా చర్యలు తీసుకోవడంలో మళ్లీ మున్సిపల్ శాఖ అధికారులు విఫలమయ్యారు అని అన్నారు ఇప్పటికైనా కబ్జా స్థలాన్ని కాపాడాలని ఆయన అన్నారు. హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ మున్సిపల్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం చాలా దారుణం అని గత ఆరు నెలల నుంచి చెప్పు లు అరిగేలా తిరుగుతున్న పట్టించుకోకపోవడం దారుణం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ అధికారికి ఫోన్ ద్వారా వివరణ కోరగా నోటీసులు పంపించామని సగం మెట్లు తొలగించడం జరిగిందని త్వరలో పూర్తి చర్యలు తీసుకుంటామని ప్రస్తుతం ఎలక్షన్లు ఉండడం వల్ల పనులు ఆగిపోతుందని సమాధానం ఇచ్చారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








