V1News Telangana

best news portal development company in india

బోధన్ బస్టాండ్‌లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం

SHARE:

 

బోధన్ పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు, ఆటో డ్రైవర్లు, స్థానిక ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల జరిగే లాభాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో RTO ఎన్‌ఫోర్స్‌మెంట్ AMVI పండరి పాల్గొని, హెల్మెట్ ధరించడం, లైసెన్స్ కలిగి ఉండడం, వాహన పత్రాలు సక్రమంగా ఉంచుకోవడం, రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

అలాగే బోధన్ ట్రాఫిక్ SI మమేష్ మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రూల్స్ పాటించాలని కోరారు.

ఈ అవగాహన కార్యక్రమం వల్ల బస్టాండ్ పరిసరాల్లో వాహనదారుల్లో చైతన్యం పెరిగిందని అధికారులు తెలిపారు

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india