నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని హున్సా గ్రామంలో ‘జీవనదాన మహాకుంభ్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది. జగద్గురు శ్రీమద్ రామానందాచార్య నరేంద్ర స్వామి మహారాజ్ శిష్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉత్సాహంగా రక్తదానం చేసి మానవతా భావాన్ని చాటారు.
ఈ శిబిరంలో సుమారు 100 నుంచి 120 మంది వరకు యువకులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. హున్సా గ్రామ సర్పంచ్ మర్కల్ శివకుమార్ స్వయంగా రక్తదానం చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.
కార్యక్రమంలో బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీల శంకర్, రామ్ గంగానగర్ సర్పంచ్ సాయినాథ్, మాజీ ఎంపీటీసీ శివకుమార్, మురిగె శంకర్, నాని, నిరీక్ష పాన్ కార్ రాజు, జిల్లా అధ్యక్షులు సాయినాథ్ కథలే, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుస్మిత బుచ్చల్వార్, మందర్న రాజు పటేల్, మాజీ జిల్లా అధ్యక్షులు జైరామ్ పటేల్ తదితరులు పాల్గొని రక్తదాతలను అభినందించారు.
రక్తదానం ద్వారా తలసేమియా, క్యాన్సర్, కిడ్నీ వ్యాధిగ్రస్తులు సహా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. “మీరు జీవించండి – ఇతరులను జీవింపజేయండి” అనే నినాదంతో నిర్వహించిన ఈ శిబిరం గ్రామంలో సామాజిక చైతన్యాన్ని మరింత పెంపొందించిందని వారు పేర్కొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








