V1News Telangana

best news portal development company in india

బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో 20వ వార్డుకు ఆయేషా ఫాతిమా పోటీ… గెలుపు ఖాయమంటున్న రాజకీయ వర్గాలు

SHARE:

బోధన్ పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో 20వ వార్డు కౌన్సిలర్‌గా మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ సతీమణి ఆయేషా ఫాతిమా పోటీ చేయనున్నట్లు సమాచారం. ఆచన్పల్లి ఏరియాలోని 20వ వార్డు నుంచి ఆమె ఎన్నికల బరిలోకి దిగనుండడం బోధన్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

బోధన్ పట్టణంలో ఐషా వెల్ఫేర్ ట్రస్టు ద్వారా పేద ప్రజలకు, చిన్నారులకు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తూ ఆయేషా ఫాతిమా సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, పేదల సంక్షేమం కోసం చేసిన సేవలు ప్రజల నుంచి మంచి స్పందనను పొందాయి.

బోధన్ నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవలందించిన మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్‌కు బోధన్ పట్టణంతో పాటు నియోజకవర్గమంతటా బలమైన ప్రజాధార ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో ఆయన చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికీ ప్రజల్లో మంచి గుర్తింపుగా ఉన్నాయని చెబుతున్నారు.

ఈ నేపధ్యంలో ఆయేషా ఫాతిమా 20వ వార్డు నుంచి పోటీ చేస్తే ఆమె విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాసేవ అనుభవం, కుటుంబ రాజకీయ నేపథ్యం, స్థానిక ప్రజల మద్దతు ఆమెకు కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 20వ వార్డు ఫలితం బోధన్ రాజకీయాల్లో కీలకంగా మారనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india