Post Views: 57
బాన్సువాడ పట్టణం సంగమేశ్వర కాలనీ 7వ వార్డులో గురువారం స్థానిక బీఆర్ఎస్ నాయకులు సూరిబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని యువకులు, కాలనీ వాసులకు గాలిపటాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ నింగిని రంగుల హరివిల్లుగా మార్చే మహా పర్వదినమని అన్నారు. నేలపై ముగ్గులతో, ఆకాశంలో గాలిపటాల ఎగరడం ద్వారా పండుగ వాతావరణం ప్రతి ఒక్కరిలో ఆనందం, ఉత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను మరింత బలపరుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు అంజిరెడ్డి, రత్నకుమార్, మోచి గణేష్, శివ తదితరులు పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









