నిజామాబాద్ పట్టణం ఆటోనగర్, సి.ఎం. రోడ్డులోని జియా హై స్కూల్ (E/M) (UG) ఆధ్వర్యంలో శనివారం, జనవరి 10వ తేదీన సైన్స్ ఎక్స్పోను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ జనాబ్ తాహెర్ బిన్ హమ్దాన్ సాహెబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైన్స్ ఎక్స్పో విద్యార్థులలో శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రయోగాలు, నమూనాలు, ప్రదర్శనలు మరియు పరస్పర చర్యల ద్వారా విద్యార్థులు శాస్త్రంలోని అద్భుతాలను అన్వేషించే అవకాశం ఈ సైన్స్ ఎక్స్పో కల్పిస్తుందని పేర్కొన్నారు. చిన్న వయసులోనే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవడం వల్ల భవిష్యత్తులో దేశ అభివృద్ధికి తోడ్పడే శాస్త్రవేత్తలుగా వారు ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు తయారు చేసిన వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రయోగాలను ఆయన పరిశీలించి అభినందనలు తెలిపారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని సైన్స్ ఎక్స్పోను విజయవంతం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








