Post Views: 42
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బోధన్ పట్టణ పరిధిలో పతంగుల దుకాణాలపై పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓల్డ్ బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ఒక పతంగుల దుకాణాన్ని తనిఖీ చేయగా, నిషేధిత చైనా మాంజ లభ్యమైంది.
దీంతో సంబంధిత దుకాణ యజమానిపై కేసు నమోదు చేసినట్లు బోధన్ టౌన్ పీస్ ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.
చైనా మాంజ వాడకం వల్ల మానవులకు, జంతువులకు, పక్షులకు తీవ్ర ప్రమాదం కలుగుతుందని, అందువల్ల దాని విక్రయం లేదా వినియోగంలో పాల్గొనేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
బోధన్ పట్టణ ప్రజలు మరియు వ్యాపారులు నిషేధిత చైనా మాంజను విక్రయించకుండా, వినియోగించకుండా సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








