నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు CCS ఏసీపీ ఇంచార్జ్ మస్తాన్ వాలి సార్ ఆధ్వర్యంలో CCS పోలీసు సిబ్బంది వ్యభిచార గృహాలపై మెరుపు దాడులు నిర్వహించారు.
ఈ దాడులు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ మరియు టౌన్–6 పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టారు. దాడుల్లో మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 4 మంది విటులు, 5 మంది విటురాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అలాగే ఘటన స్థలంలో నుంచి 8 మొబైల్ ఫోన్లు మరియు నగదు రూ.27,290లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వ్యక్తులు, వస్తువులను సంబంధిత పోలీస్ స్టేషన్ SHO గారికి అప్పగించినట్లు CCS పోలీసులు వెల్లడించారు.
అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








