V1News Telangana

best news portal development company in india

బోధన్ టౌన్–2 పరిధిలో విద్యుత్ ప్రజా బాట కార్యక్రమం సాలూర, హుంసా గ్రామాల్లో వినియోగదారుల సమస్యల పరిష్కారం

SHARE:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఈరోజు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రజా బాట కార్యక్రమంను బోధన్ టౌన్–2 సెక్షన్ పరిధిలోని సాలూర మరియు హుంసా గ్రామాలలో నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యక్షంగా తెలుసుకుని, కొన్ని సమస్యలను అక్కడికక్కడే సత్వరంగా పరిష్కరించారు. మిగిలిన సమస్యలకు అవసరమైన సామగ్రి కొరకు అంచనాలు (ఎస్టిమేట్లు) తయారు చేసి, త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.
అదేవిధంగా విద్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి, భద్రతా సూత్రాలపై కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కె. నాగేష్ కుమార్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, బోధన్ గారు, మరియు కళ్యాణ్, ఏఈ, బోధన్ టౌన్–2 గారు మాట్లాడుతూ—
ప్రజా బాట కార్యక్రమాన్ని ప్రతి వారం మంగళవారం, గురువారం, శనివారం పలు గ్రామాలలో నిర్వహిస్తూ, ప్రజల మరియు రైతుల విద్యుత్ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తామని తెలిపారు.
విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యుత్ పొదుపు విధానాలు, కెపాసిటర్లు అమర్చడం వలన కలిగే లాభాలపై వివరించారు.
అలాగే కాలి పోయిన ట్రాన్స్‌ఫార్మర్లు, తెగిపడిన విద్యుత్ వైర్లు, లూస్ లైన్లు, వంగిన స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ గద్దెలు, విరిగిన స్తంభాలు, చెట్టు కొమ్మలు తగలడం వంటి సమస్యలు తెలియజేస్తే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ట్రాన్స్‌ఫార్మర్లు ఫెయిల్ అయినప్పుడు, వాటిని డిపార్ట్మెంట్ వాహనంలోనే రిపేర్ చేయించి తిరిగి ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఏవైనా విద్యుత్ సంబంధిత సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1912కు కాల్ చేసి తెలియజేయవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఓంప్రకాష్ (సబ్ ఇంజనీర్, బోధన్), గంగకిషన్ (లైన్ ఇన్‌స్పెక్టర్), శాంతి ప్రకాష్, భరత్ (అసిస్టెంట్ లైన్ మెన్‌లు), సాలూర మరియు హుంసా గ్రామ సర్పంచులు, విద్యుత్ వినియోగదారులు, రైతులు మరియు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india