V1News Telangana

best news portal development company in india

నిరుపేద బాలికకు లయన్స్ క్లబ్ సైకిల్ బహుకరణ విద్యాభివృద్ధికి లయన్స్ క్లబ్ తోడ్పాటు…

SHARE:

7వ తరగతి విద్యార్థినికి సైకిల్ అందజేసిన లయన్స్ క్లబ్
అమ్ము కౌర్‌కు లయన్స్ క్లబ్ చేయూత..

వార్త:
బోధన్: (03-01-2026) శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ – శ్రీ హరి సేవ క్లబ్ ఆధ్వర్యంలో ఆటో నగర్‌కు చెందిన నిరుపేద బాలిక అమ్ము కౌర్‌కు సైకిల్‌ను బహుకరించారు. ఆచన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న అమ్ము కౌర్ విద్యాభ్యాసానికి తోడ్పాటుగా ఈ సైకిల్‌ను క్లబ్ తరపున మల్టిపుల్ జి.ఏం.టి మరియు పి.డి.జి లయన్ పి. బసవేశ్వర్ రావు గారి చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ తన్నీరు సుబ్బారావు ఎం.జె.ఎఫ్ మాట్లాడుతూ, పేద విద్యార్థులు చదువులో ముందుకు సాగేందుకు లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ లయన్ చల్లా శ్రీనివాసరావు, ట్రెసరర్ కొత్తపల్లి నవిత, లయన్ కె. నాగేశ్వరరావు, రూరల్ ఆర్‌సీ లయన్ పావులూరి వెంకటేశ్వర్ రావు, లయన్ సురాబత్తుని శ్రీనివాసరావు, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india