V1News Telangana

best news portal development company in india

వర్ని మండలం హుమనాపూర్ సొసైటీ ఎదుట రైతుల నిరసన

SHARE:

వర్ని

హుమ్మాపూర్

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం హుమ్మాపూర్ గ్రామం సొసైటీ ఎదుట రైతులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత నెల రోజుల నుంచి ఎరువుల కోసం చెప్పులు అరిగిలా తిరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని సుమారు 42 నుంచి 50 వేల రూపాయలు డీడీలు చెల్లించి నెలరోజులు అవుతున్న తమకు ఇవ్వడం లేదని, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల కోసం పోతే ఈసడిస్తూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం రైతులు చేశారు. కొంతమంది డబ్బులు ఇస్తామంటే కూడా ఎరువులు ఇస్తలేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ అధికారుల నిర్లక్ష్యం తమ పాలిట శాపంగా మారుతుందని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వర్నిలో ప్రైవేటు ఎరువుల షాపులో కొనుగోలు చేయాలంటే అధిక రేట్లకు విక్రయిస్తున్నారని చాలా లాస్ అవుతున్నామని తమ గోడును విన్నవించే నాధులు కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india