పెద్దగుట్టలో భక్తులకు అడుగడుగునా సంకటాలే
ఐదు ధర్మశాలలు వృధాగా ఉన్నాయి
పారిశుద్ధ్యం అస్తవ్యస్తవ్యం
అధిక ధరతో వస్తువులు కొనవలసిన పరిస్థితి
ప్రవేటు రూములలో అధిక అద్దే వసూలు చేయడానికి సిద్ధం
పులి క్యాప్ నుంచి రోడ్లు సరిగా లేక రోడ్లు మూలమలుపులు ప్రమాద సూచికలు లేవు
అర్ధాంతంగా అనేక ఏళ్ళ నుంచి ఆగిపోయిన
చాలా చోట్ల చెత్తాచెదారం మురికి నీరు అస్తవ్యస్తమైన పారిశుద్ధ్యం
ఉర్సు కోసం 18 లక్షలు మంజూరైతే ఏం చేశారు నామమాత్రంగా అక్కడక్కడ మొరం పోశారు అభివృద్ధి శూన్యం
మెట్ల పరిస్థితి అద్వానంగా ఉన్నాయి పైకి వెళ్లాలంటే ఇబ్బందులు తప్పవు
పైన దర్గ వద్ద ధర్మశాలలు సరిగా లేవు
మౌలిక వసతులు అంతంత మాత్రమే నీటి సౌకర్యం కూడా అంతంత మాత్రమే.

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పెద్దగుట్ట, బడా పహాడ్ పుణ్యక్షేత్రంలో ఈనెల అనగా డిసెంబర్ 31 వ తేదీన ఉర్సు ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి, మూడు రోజులపాటు ఉరుసు ఉత్సవాలు ఉంటాయి, 2026 సంవత్సరం జనవరి 1న రెండో రోజు ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ఖవాలీ ప్రోగ్రాం ఉంటుంది, రెండో తారీకు అనగా మూడో రోజు ఉర్సు ఉత్సవాల్లో భాగంగా అన్నదానం ,దీపారాధన కార్యక్రమం ఉంటుంది. మూడు రోజుల ఉర్సు ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి, మూడు రోజుల ఉర్సు ఉత్సవాల్లో ,పాల్గొనడానికి, మొక్కుబడులు తీర్చుకోవడానికి మన రాష్ట్రం నుంచి కాకుండా పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లా ల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు, ఈ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా వక్బోడ్ వారు సౌకర్యాలు ఇతర పనుల కోసం 18 లక్షలు మంజూరు చేసింది. సుమారు 18 లక్షల రూపాయలు మంజూరు చేసినప్పటికీ సరిగా పనులు చేయటం లేదని ఈ డబ్బులు కూడా స్వాహా చేసే కార్యక్రమం జరుగుతుందని పలువురు మండిపడుతున్నారు. దర్గా ప్రాంగణంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని మెట్ల సౌకర్యం సరిగా లేదని వివిధ సౌకర్యాలు కూడా సరిగా లేవని మౌలిక వసతులు సరిగా లేవని భక్తులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉన్నాయని వీటిపై జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టాలని కుల మతాలకు అతీతంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కావున వారికి ఇబ్బంది కలకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. పెద్దగుట్టలో హజ్రత్ సయ్యద్ షాదుల్లా హుసేని రహ దర్గా చాలా ప్రాముఖ్యమైనది, ఈ బాబా శాదుల దర్శనం కోసం భక్తులు తాండూప తండలుగా వస్తారు వారికి సరైన సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించే విధంగా జిల్లా కలెక్టర్ చూడాలని ప్రజలు అంటున్నారు.
వర్ని నుంచి జాకో జాకోర నుంచి జలాల్పూర్ అదేవిధంగా పులికాప్ప్ వరకు వెళ్లే ప్రధాన రహదారి బాగా ఉన్నప్పటికీ పులి క్యాంపు నుంచి బడాపాడు కు వెళ్లే ప్రధాన రహదారి చాలా ప్రమాదకరంగా ఉందని మూలమలుపు ఉన్నాయని సైడ్లు చాలా అధ్వానంగా మారాయని సైట్లకు మొరం లేకపోవడం అదేవిధంగా ప్రమాద సూచికలు లేకపోవడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పులి క్యాంపు తో పాటు పలుచోట్ల బెల్ట్ షాపులు అనగా మద్యం అధిక ధరలకు అనగా ఇతర వస్తువులు కూడా అధిక రేట్లకు విక్రయాలు చేస్తున్నారని అదేవిధంగా పుణ్యక్షేత్ర ప్రాంగణంలో కూడా వస్తువులు అధిక రేట్లకు విపరీతమైన రేట్లకు విక్రయించడం పట్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భక్తులకు నిలువుగా ముంచుతున్నారని వీటి పై ఎవరు కూడా దృష్టి పెట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కట్టిన రూములలో అసాంఘిక కార్యక్రమాలు తాగుబోతులకు అడ్డగా మారాయని , ఒక్కొక్క రూముకు సుమారు 1000 నుంచి 5000 ఆపై అద్దే డబ్బులు ప్రతిరోజు వసూలు చేస్తున్నారని ఇస్తాను సారంగా భక్తులకు నిలువు దోపిడీ చేస్తున్నారని వీటిపై దృష్టి పెట్టాల్సిన అధికారుల జాడ కనుమరుగైందని పలువురు మండిపడుతున్నారు, అసాంఘిక కార్యక్రమాలు దొంగతనాలు దోపిడీ అధిక రేట్లకు విక్రయాలు ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం పై సంబంధిత శాఖ అధికారులు , అదేవిధంగా సీసీ కెమెరాలు లేవని వాటిని కావాలని దోషం చేశారని దర్గ వద్ద కూడా సీసీ కెమెరా ధ్వంసం చేసి ఎలాంటి విషయాలు బయటకు రాకుండా ఆధారం లేకుండా చేస్తున్నారని వీటిపై దృష్టి పెట్టాల్సిన అధికారులు జాడ లేకుండా పోయారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వర్నిలో జాకోరా క్రాసింగ్ వద్ద సూచిక బోర్డు పడిపోయి సంవత్సరం అవుతుంది పట్టించుకోవడం లేదు
వర్ని నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దగుట్టకు వెళ్లాలంటే వర్ని నుంచి జాకోర వెళ్లే క్రాసింగ్ వద్ద సూచిక బోర్డు ఒక లారీ బుద్ధి వేయడంతో సంవత్సరమై మూలన పడిందని ఇప్పటికీ దాన్ని వక బోర్డు వారు అమర్చలేకపోతున్నారని సూచిక బోర్డు లేక చాలా మంది ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన భక్తులు ఎక్కడికి వెళ్లాలో ఇతర గ్రామాలకు ఇతర చోట్లకు వెళ్లే పరిస్థితి వస్తుందని సూచిక బోర్డు ఏర్పాటు చేయడంలో వక బోర్డ్ వారు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు మండిపడుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








