నిజామాబాద్ జిల్లాలో నెల మొదటి వారంలో ఆటోల ద్వారా రేషన్ మాఫియా ఎక్కువ మోతాదులో రైస్ మిల్లులకు సరఫరా అవుతుంది అని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ప్రజల వద్ద తీసుకున్న తర్వాత ఆ రేషన్ బియ్యాన్ని తమ ఇంట్లో రేషన్ మాఫియా దారులు నిలువ ఉంచుతారాట రేషన్ బియ్యాన్ని డంపు చేసిన తర్వాత బియ్యాన్ని సంబంధిత పిడిఎఫ్ బియ్యం తీసుకుంటున్నా రైస్ మిల్లులకు తరలిస్తారు. ప్రజల వద్ద నుండి ఆటోలో, ఆటోల నుంచి ఇంట్లో ఇంట్లో నుంచి రైస్ మిల్లులకు రైస్ మిల్లు నుంచి ఇతర రాష్ట్రాలకు ఈ రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తారు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతున్న సమయంలో సంబంధిత శాఖ అధికారులు దృష్టి పెట్టకపోవడంపై 14 కిలో చొప్పున కొన్న బియ్యము దాదాపు 30 రూపాయలకు అమ్మకాలు చేస్తున్నారు రేషన్ మాఫియా దారులు.వీళ్ళతో పాటు కొంతమంది అధికారులు సైతం మామూల మత్తులో నిమగ్నమై ఎన్నో సంవత్సరాలనుండి రేషన్ మాఫియా కు బ్యాక్ బోన్ ల ఉన్నారనే మాటలు సర్వాత్రం వినబడుతున్నాయి.నిజామాబాద్ జిల్లాలో ని కొందరు అధికారులు నిద్రమత్తులో ఉండటం వలన రేషన్ బియ్యం, లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు సరఫరా అవుతుందని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. సీసీ కెమెరాలు ఎదుట నుంచి రేషన్ బియ్యంతో నిండిన ఆటోలో మరియు బొలెరో పికప్ వాహనాల్లో తీసుకెళ్తున్నారు. ప్రజల ఎదుట ప్రభుత్వ అధికారులు ఎదుట అక్రమ రవాణా జరుగుతున్న వారి పైన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి వచ్చే నూతన సంవత్సరం మొదటి వారంలో జరిగే అక్రమ రేషన్ రవాణలను అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








