హుండీ లెక్కింపు సమయంలో
వక బోర్డు వర్సెస్ పూజార్లకు మధ్య వాగ్వాదం
వర్ని
నిజాంబాద్ జిల్లా వర్ని మండలం పెద్దగుట్ట పుణ్యక్షేత్రంలో గత కొన్ని నెలల నుంచి హుండీలో పైసలు జమ కావడంతో వకబోర్డ్ వారు హుండీ లెక్కింపు చేయడం జరిగింది ఈ సందర్భంగా మొల్లలు అనగా పూజారులు వారితో వాగ్వాదానికి దిగారు. కొన్ని నెలలకు ఒకసారి కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని అదేవిధంగా ప్రతి సంవత్సరం టెండర్ విషయంలో కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నప్పటికీ వక బోర్డు వారు అభివృద్ధి ఎక్కడ చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా కొంతమంది హుండీ లెక్కింపు సమయంలో డబ్బులు అన్ని స్వాహా చేస్తున్నారని తీసుకు వెళ్తున్నారని కనీసం ప్రభుత్వానికి అప్పజెప్పకుండా కోట్ల రూపాయలలో లక్ష రూపాయలు పక్కన వేసుకొని దొంగలించి తీసుకువెళ్తున్నారని కొంతమంది ఆరోపణలు చేశారు కనీసం సీసీ కెమెరాలు నిఘా లేదని, తలుపులు వేసుకొని హుండీ లెక్కింపు చేయడం ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు. సీసీ కెమెరాల పహారా లేకుండా సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రతి ఏటా కొద్ది నెలలుగా జమ అయిన హుండీ లెక్కింపులో స్వాహా చేసుకుని పోతున్నారని ప్రభుత్వానికి అప్పజెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చాలాసేపటి వరకు ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు రావడంతో, తలుపులు వేసుకొని హుండీ లెక్కింపు చేయడం వెనుక అంతరం ఏమిటని పలువురు విమర్శలు చేశారు మొలలకు అనగా పూజారులకు పంపించడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. తలుపులు వేసుకొని చేయడం వెనుక అంతరం ఏమిటని ఇలాగైతే స్వాహా చేసుకునే సందర్భాలు ఉండవా మొత్తం డబ్బులు ప్రభుత్వానికి అందకుండా ఎవరికి వారు పంచుకొని తీసుకువెళ్తున్నారని ప్రతి సంవత్సరం ఇదే తంతు జరుగుతుందని దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కొంతమంది ఆరోపణలు చేయడం జరిగింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








