దారుణంగా మారిన నిజాంసాగర్ డిస్ట్రిబ్యూట్ కెనాల్
కిందిస్థాయి ఆయకట్టు వరకు నీరు అందటం లేదు
చివరి ఆయకట్టు రైతులకు నీరు అందటం లేదు నిజాంసాగర్ కాలువల పరిస్థితి అద్వానంగా ఉన్నాయి
ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు పాలకులు పట్టించుకున్న దాఖలు లేవు
రుద్రూరు
రాయకూరు
నిజాంబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని రాయకూరు గ్రామంలోని డి 28/5 కెనాల్ పరిస్థితి దారుణంగా మారింది. నిజాంసాగర్ డిస్ట్రిబ్యూట్ కెనాల్ సరిగా లేదని చెత్తాచెదరం బాగా కాలువలో నిండి ఉందని దీని గురించి ఇరిగేషన్ అధికారులు పాలకులు పట్టించుకోవటం లేదని కిందిస్థాయి రైతులకు నీరు అందక అనేక ఇబ్బందులు రైతులు ఎదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో కాలువల పరిస్థితి అద్వానంగా మారాయి అని చెత్తాచెదరం నింది నీరు వెళ్ల లేని పరిస్థితి నెలకొందని ప్రజలు అంటున్నారు. అనేక ఏళ్ల నుంచి కాలువలను పట్టించుకున్న దాఖలు లేవని వాటిని రైతులే స్వయంగా ఖర్చు చేసి చేసుకుంటున్న పరిస్థితి ఉంటుందని చెత్తాచెదరం ముళ్ళపదలు వాటిని బాగు చేసిన అధికారులు పాలకులు లేరని రైతులు అంటున్నారు. రైతు గోడును పట్టించుకోవడం లేదని నిజాంసాగర్ నీరు వదిలినప్పటికీ నీరు మాత్రం కిందిస్థాయి రైతులకు అందని ద్రాక్షగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అనేక చోట్ల డిస్ట్రిబ్యూట్ కెనాల్ , పిల్ల కాలువల పరిస్థితి బాగోలేదు ఇరిగేషన్ అధికారులు ,పాలకులు సరిగా పట్టించుకోకపోవడం వల్ల కిందిస్థాయిలో ఉన్న రైతులకు నీరు అందని పరిస్థితి నెలకొందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








