బోధన్ పట్టణంలో కొందరు యువకులు బండి సైలెన్సర్లను తీసేసి అదుపు లేని స్పీడుతో గల్లీలో వాహనాలు నడిపిస్తున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. వీరు అతివేగంగా బైకులు నడపడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని అతివేగంగా వాహనాల నడుపుతున్న యువకులను సంబంధిత శాఖ అధికారులు హెచ్చరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కొందరు మైనర్ యువకులు కూడా అతివేగంగా ఒకే బైకుపై ముగ్గురు ముగ్గురు వెళ్లడం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది. బోధన్ పట్టణం లోని రాకాసిపేట్ శక్కర్ నగర్ ఏరియాలో ఎక్కువ మోతాదులో యువకులు బైక్ పై స్టాంట్లు చేస్తున్నారని హండ్రెడ్ స్పీడ్ లో వానలను తీసుకెళ్తున్నారని, ఇంట్లో మెల్లిగా వాహనాలను తీసి రోడ్డుపై ఎక్కంగానే స్పీడును పెంచుతున్నారట ఈ బైక్ రేసర్లు తమ పిల్లలకు ఏమవుతుందని కుటుంబ సభ్యులు సైతం చింతిస్తున్నారు. బోధన్ పట్టణ అధికారులు దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








