V1News Telangana

best news portal development company in india

ప్రజల తీర్పు అభివృద్ధికి… రాజకీయ కక్షలకు కాదు….అభివృద్ధి కోసం ఓటేశారు… : రాజ్యాంగ విలువలపై గ్రామాల్లో చర్చ …

SHARE:

గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలు సర్పంచ్‌లను గెలిపించినప్పటికీ, కొన్ని గ్రామాల్లో ఎన్నికల అనంతరం రాజకీయ కక్ష సాధింపులు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ప్రజలు అభివృద్ధి కోసం ఇస్తారు తప్ప, ప్రత్యర్థులపై వ్యక్తిగత దాడులు లేదా వేధింపుల కోసం కాదని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.

ఈ దేశంలో అన్యాయానికి ఎదురుగా నిలబడేందుకు చట్టం ఉందని, న్యాయం చెప్పేందుకు న్యాయవ్యవస్థ ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ, రాజ్యాంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.

“ఇది భారతదేశం. ఇది ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు. ఇష్టం వచ్చినట్టు పాలన చేయడానికి, రాజకీయాలను రాజ్యాంగం మీద రుద్దడానికి ఈ దేశం అనుమతించదు,” అని సామాజిక కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు ఓటు వేసింది రోడ్లు, తాగునీరు, ఉపాధి, మౌలిక వసతుల కోసం తప్ప, గ్రామాల్లో విభేదాల కోసం కాదని వారు చెబుతున్నారు.

రాజకీయ విభేదాలను చట్ట పరిధిలోనే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని, పాలకులు బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం ఇదేనని ప్రజలు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. ఎన్నికలు ముగిశాయి… ఇప్పుడు ప్రారంభం కావాల్సింది పాలన అని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india