Post Views: 242
ఓట్ల కోసం పంపిణీ చేశారనే ఆరోపణలు – గ్రామం మొత్తం అనుమానాల వలయంలోకి
వర్ని, :
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జలాల్పూర్ గ్రామంలో దొంగ నోట్ల వ్యవహారం సంచలనం సృష్టించింది. జలాల్పూర్ గ్రామానికి చెందిన రైతు చిన్న సాయిలు (నరేడ్ల సాయిలు) క్రాప్ లోన్ చెల్లింపుల నిమిత్తం వర్ని మండల కేంద్రంలోని కెనరా బ్యాంకుకు వచ్చాడు. నగదును క్యాష్ కౌంటర్‌లో మెషిన్ ద్వారా పరిశీలించగా, మొత్తం 417 నకిలీ ₹500 నోట్లు — విలువ ₹2,08,500 పూర్తిగా నకిలీగా గుర్తించారు.
ఈ విషయం తెలిసిన వెంటనే బ్యాంక్ మేనేజర్ వర్ని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వర్ని ఎస్ఐ రాజు తెలిపారు.
🔍 విచారణలో కీలక మలుపులు
ఈ ఘటనతో జలాల్పూర్ గ్రామంలో తీవ్ర కలకలం నెలకొంది. దొంగ నోట్లు గ్రామంలోకి ఎలా వచ్చాయి? ఎవరి ద్వారా పంపిణీ అయ్యాయి? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. నరేడ్ల సాయిలుతో పాటు ఆయన కుమారుడు సాయికుమార్‌ను కూడా విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
🗳️ ఎన్నికల కోణంలో గ్రామంలో ఆరోపణలు..
ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ఓట్లు రాబట్టుకునేందుకు నగదు పంపిణీ జరిగిందని, ఆ సమయంలో నకిలీ నోట్లు ప్రజలకు చేరినట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక వ్యక్తికి పంపిణీ కోసం సుమారు రూ.5 లక్షలు అందజేశారని, అందులో కొంత పంపిణీ చేసి, మిగిలిన నగదును దాచుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ దాచిన నగదే ఇప్పుడు బ్యాంకులో పట్టుబడినదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
❓ ప్రశ్నల వర్షం
గ్రామంలో ఇంకా ఎంతమంది వద్ద నకిలీ నోట్లు ఉన్నాయి?
అసలు నోట్లుగా భావించి ప్రజలు మోసపోయారా?
దొంగ నోట్లు సరఫరా చేసిన అసలు సూత్రధారులు ఎవరు?
ఈ వ్యవహారం ఎంతకాలంగా సాగుతోంది — లక్షల్లోనా? కోట్లల్లోనా?
అన్న ప్రశ్నలు ప్రజల్లో తీవ్రంగా చర్చకు వస్తున్నాయి.
🚨 స్పందనపోలీసుల
ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నప్పటికీ, పోలీసులు మాత్రం ఎలాంటి ఒత్తిడులకు తావివ్వకుండా లోతైన విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ విషయమై ఎస్ఐ రాజును వివరణ కోరగా, “దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తాం” అని తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








