V1News Telangana

best news portal development company in india

బోధన్ రాజకీయాల్లో భూకంపం! ఇసుక మాఫియాపై షకీల్ సింహగర్జన “కార్యకర్తలకు అండగా నేనున్నా”

SHARE:

బోధన్ (నిజామాబాద్ జిల్లా):

బోధన్ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత మహమ్మద్ షకీల్ అమీర్ తన నివాసంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో అధికార యంత్రాంగంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇసుక మాఫియా యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నా, సబ్ కలెక్టర్ సహా సంబంధిత అధికారులు మౌనం పాటించడంపై ఘాటుగా ప్రశ్నించారు.

నూతనంగా ఎన్నికైన సర్పంచులను సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ నేతలపై అనవసర ఒత్తిళ్లు తక్షణమే మానాలని డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బాధ్యత ఎవరిది? అంటూ అధికారులను నిలదీశారు. అక్రమ ఇసుక దందా వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం జరుగుతున్నా చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తున్నదన్నారు.

రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటుతుందని, జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
“అధికారం వస్తే మాటలే కాదు.. చేసి చూపిస్తాం” అని స్పష్టం చేశారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india