Post Views: 75
రెంజల్
కందకుర్తి…
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోధన్ నియోజకవర్గం పరిధిలో కందకుర్తి మహా పుణ్యక్షేత్రం ఉంది. ఈ పుణ్యక్షేత్రానికి ఒక చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. రాష్ట్ర నలుమూలల నుంచి ఇతర రాష్ట్రం నుంచి భక్తులు తండూప తండలుగా వచ్చి ఇక్కడ దేవుని దర్శనం తీసుకొని గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేస్తారు ఇలా చేస్తే పాపాలు పోతాయని ఎలాంటి కష్టాలు రాబోవు అని భక్తుల నమ్మకం, అందుకే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కు బడులు తీర్చుకొని పుణ్యస్నానాలు చేస్తూ ఉంటారు. కానీ పుణ్యక్షేత్ర ప్రాంగణం మొత్తం సమస్యలకు నిలయంగా మారింది స్నానపు గదులు సరిగా లేవని మహిళ భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాగునీరు సౌకర్యం సరిగా లేవని వాటికి సంబంధించిన నల్లలు వృధాగా ఉన్నాయని గ్రామం నుంచి పుణ్యక్షేత్రం వరకు వెళ్లే రోడ్డు సరిగా లేదని సీసీ రోడ్లు అద్వానంగా మారాయని భక్తులు ప్రజలు పేర్కొంటున్నారు. గోదావరి నదిలో కూడా నాచు విపరీతంగా పెరిగిపోయిందని స్నానం వెళ్లాలంటే అక్కడ సరిగా సౌకర్యం లేదని ఎక్కడ జారీ పడతారు అన్న భయం పరిస్థితిలో భక్తులు ఉన్నప్పటికీ సమస్యలు మాత్రం పరిష్కరించే నాధుడు కరువయ్యారని భక్తులు మండిపడుతున్నారు, ఏండ్లు గడుస్తున్న సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా ఉన్నాయని ప్రజలు అంటున్నారు. కందకుర్తి నుంచి పక్కనే మహారాష్ట్ర బార్డర్ ఉందని మహారాష్ట్రకు వెళ్లే బ్రిడ్జి మాత్రం శిథిలావస్థితికి చేరిందని ఎప్పుడూ కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఈ బ్రిడ్జి పక్కనే దేవాలయం కు వెళ్లే బ్రిడ్జి కూడా కూలిపోయిందని ఎన్నో ఏళ్లు గడుస్తున్నప్పటికీ బ్రిడ్జి నిర్మాణం చేయడం లేదని దీంతో భక్తులు రాకపోకలకు అంతరం ఏర్పడుతుందని గ్రామం నుంచి ఇతర రోడ్డు గుండా భక్తులు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ప్రజలు అంటున్నారు.
ఈ మధ్యకాలంలో భారీగా వర్షాలు కురవడంతో బ్రిడ్జి పైనుంచి నీళ్లు వెళ్లడంతో సుమారు 15 నుంచి 20 రోజుల వరకు రాకపోకలు ఆగిపోయాయని ప్రజలు అంటున్నారు సుమారు 55 సంవత్సరాలు నుంచి బ్రిడ్జి నిర్మాణం జరిగి ఉందని శిథిలావస్థకు చేరిందని కందకుర్తి నుంచి మహారాష్ట్ర ధర్మబాదుకు ఆపై మహారాష్ట్ర స్టేట్ కు వెళ్లే భక్తులు, ప్రయాణికులు వాహన పదాలను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బ్రిడ్జి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా అటు మహారాష్ట్ర సర్కార్ ఇటు తెలంగాణ సర్కార్ దీనిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అక్కడికి వచ్చి పరిస్థితులు, చూడడం జరిగిందని ఏది ఏమైనా వీటిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. దేవాలయంలో ఉన్న సమస్యలు కూడా చాలా ఉన్నాయని, ఎంతో దూరం నుంచి వచ్చిన పూజార్లకు కూడా అనేక సమస్యలు ఉన్నాయని వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ ,సహకారాలు అందడం లేదని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








