V1News Telangana

best news portal development company in india

*నేడు జరిగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69 వ వర్ధంతిని జయప్రదం చేయండి*

SHARE:

.. *తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం*

నిర్మల్ / డిసెంబర్ 5 జిల్లా

తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69 వ వర్ధంతి కార్యక్రమం ను వాడ వాడ లో గ్రామ గ్రామ న అన్ని ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించాలని, పిలుపునిచ్చారు . ప్రపంచ జ్ఞాని, భారత జాతిపిత నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటొల్ల వెంకటస్వామి పిలుపునిచ్చారు . వర్ధంతి కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ విగ్రహాలను చుట్టుప్రక్కల పరిసరాలను శుభ్రపరిచి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి పంచశీల నీలి జెండాలను ఎగురవేసి పంచశీల ప్రార్థన చదివి రెండు నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళులర్పించాలని అన్నారు . అనంతరం అంబేద్కర్ జీవిత చరిత్ర పై సభలు సమావేశాలు నిర్వహించాలని అన్నారు . ఈ కార్యక్రమాలు ఉదయము 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బత్తుల రంజిత్, జిల్లా ఉపాధ్యక్షులు ఈరొల్ల పురుషోత్తం , గౌరవ సలహాదారులు వెలుమల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india