V1News Telangana

best news portal development company in india

పెద్దగుట్ట దోపిడి పై చర్యలు ఉండవా

SHARE:

వర్ని
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పెద్దగుట్ట అనగా బడాపహాడ్ పుణ్యక్షేత్రం చాలా పవిత్రమైంది జాతీయ సమైక్యతకు అతితంగా కులమతాలకు అతీతంగా భక్తులు దేశ నలుమూల రాష్ట్రం నుంచి . . తండూప తండాలుగా వస్తూ ఉంటూ తమ మొక్కుబడును తీర్చుకుంటారు. పెద్దగుట్ట పుణ్యక్షేత్రంలో బాబా షాదుల్లా హుస్సేనీ దర్గా చాలా పవిత్రమైంది ఈ దర్గా దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు, ప్రతి సంవత్సరం మూడు రోజులుగా ఉర్సు ఉత్సవాలు కూడా జరుగుతాయి ఈ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా సుమారు 15 నుంచి 16 లక్షల వరకు డబ్బులు కూడా వక్బోర్డు నుంచి మంజూరు అవుతాయి ఈ డబ్బులు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టకుండా.
స్వాహా చేస్తారు అనే ఆరోపణలు ఉన్నాయి. గడిచిన సంవత్సరం సుమారు రెండు నెలలుగా వారు అనగా గత సంవత్సరం వారు రెండు నెలలు పుణ్యక్షేత్ర ప్రాంగణంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సుమారు ఐదు కోట్లకు పైగా టెండర్ పలకడం జరిగింది. ఈ టెండర్ అయినా రెండు నెలలకే మళ్లీ రెండు వర్గాల మధ్య కోర్టు వివాదం రావడంతో పెండింగ్ పడిపోవడంతో కాంట్రాక్టు వ్యవస్థ ఆగిపోవడంతో మళ్లీ వక్కు బోర్డ్ వారే సుమారు ప్రస్తుతం 9 నెలలుగా బాధ్యతలు చేపడుతున్నారు.
గతంలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నప్పుడు దోపిడీ ఏ విధంగా ఉండేదో మళ్లీ ఉందని పలువురు అంటున్నారు. పెద్దగుట్ట పుణ్యక్షేత్రం దోపిడీకి కేర్ ఆఫ్ గా నిలిచిందని పలువురు అంటున్నారు. ప్రతి ఆదివారం, శుక్రవారం జాతర ఉత్సవాలు జరుగుతుంది అనేకమంది భక్తులు వచ్చి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు కందూర్లు సమర్పించడానికి సుమారు 500 నుంచి 2000 ,5000 వరకు భక్తుల నుంచి నిలువు దోపిడీ చేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ ఇది దర్గా వద్ద, కమిలి వద్ద మేకను సమర్పించే వద్ద 800 రూపాయల చీటీ ఇస్తారు కానీ కటింగ్ ఇతర చర్మం పేరుతో సుమారు రెండువేల వరకు దోపిడీ చేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. కాంట్రాక్ట్ వ్యవస్థ లేనప్పుడు కూడా ఏ వస్తువు కొనాలన్నా అధిక రేట్లు వసూలు చేస్తున్నారని కనీసం నీళ్లు కూడా అధికరేట్లకు అమ్ముతున్నారని దోపిడీ మాత్రం విచ్చలవిడిగా ఉందని పలువురు అంటున్నారు. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని చెత్తాచెదరం ఉందని దీని గురించి పట్టించుకునే నాధుడు లేరని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. వక్కు బోర్డు కు సంబంధించిన సిబ్బంది సుమారు 21కి పైగా ఉండాలి కానీ ఇక్కడ సుమారు కొంతమంది ఉండడం వల్ల పారిశుద్ధ్యం కానీ ఇతర నిర్వహణ బాధ్యతలు గాని సరిగా ఉండడం లేదని పలువురు అంటున్నారు, నమాజులో ఉండే వక్బోడ్ సిబ్బంది ఇతర సిబ్బంది దర్గ వద్ద వచ్చి భారీగా గల్లాలో వేసే డబ్బులు జేబులో పెట్టుకుంటున్నారని గల్లాకు తాళం వేస్తున్నారని దర్గ వద్ద సీసీ కెమెరాలు సరిగా పనిచేయకుండా చేస్తున్నారని వారి యొక్క దోపిడీ బయటపడకుండా సీసీ కెమెరాలు పనికి రాకుండా చేస్తున్నారని, పలువురు ఆరోపణ చేస్తున్నారు ఇక్కడ భద్రత కూడా కరువైందని పలువురు అంటున్నారు. ప్రతి రెండు నెలలు లేదా ఆపై గల్లా తీయాల్సి ఉండగా అలాంటిదేమీ చేయటం లేదని దాంట్లో వచ్చిన పైసలు కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడంతో పక్కదో వ పట్టిస్తూ స్వాహా చేసుకుంటూ దోపిడీ చేస్తున్నారని ప్రజలు ,భక్తులు ఆరుపనలు చేస్తున్నారు. పైన ఒక ధర్మశాల ఉందని కింద ఐదు ధర్మశాలలు ఉన్నాయని వాటి పరిస్థితి చాలా అధ్వానంగా మారాయి అని భక్తులు ఉండడానికి ధర్మశాలలు లేవని పలువురు ఆరోపణలు చేస్తున్నారు వాటి పరిస్థితి ముందు నెయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారిందని రేకులు ఊడిపోయాయని కింద పిచ్చులు ఊడిపోయాయి వాటి గురించి పట్టించుకునే నాధుడు కరువయ్యారని ప్రజలు, భక్తులు అంటున్నారు. వక్కు బోర్డు కు సంబంధించిన స్థలం అయినప్పుడు ఫారెస్ట్ కు సంబంధించిన స్థలమైనప్పుడు చాలామంది రూమ్లో ఇష్టానుసారంగా కడుతున్నారని జలాల్పూర్ గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా ఆ గ్రామపంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా టాక్స్లు కట్టకుండా రూములు ఇష్టానుసారంగా కడుతున్నారని కొంతమంది హంగు హర్బడాలతో కట్టి సుమారు ప్రతిరోజు 500 నుంచి సుమారు 5000 వరకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని అద్దె రూపంలో పలువురు అంటున్నారు ఎక్కడ చూసినా దోపిడీ మాత్రం బాగానే ఉందని దీని గురించి వక్కు బోర్డ్ వారు గాని అదే విధంగా జిల్లా కలెక్టర్ కానివ్వండి అదే విధంగా సబ్ కలెక్టర్ అధికారులు పట్టించుకున్న దాఖలు లేవని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దగుట్ట పుణ్యక్షేత్రం కొండపైకి వెళ్లాలంటే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మెట్లు సరిగా లేవు ఇక్కడ కూడా చాలామంది భక్తులు అనగా దాతలు రూపంలో రేకుల షెడ్లు ఏర్పాటు చేశారు లైటింగ్ సౌకర్యం దర్గా వద్ద కానీ ఇతర వద్ద లేకపోవడంతో అంధకారంలో ఉంటుందని చాలా మంది లైటింగ్ వ్యవస్థ లేకపోవడంతో అంధకారంలో కొండపై ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతుందని దీనిపై పట్టించుకున్న నాధులు లేరని పలువురు ఆరు పనులు చేస్తున్నారు. లైటింగ్ సౌకర్యం దాతలు సౌకర్యం ఏర్పాటు చేసిన ఉన్నాయని వగ్ఫోర్డ్ వారు ఎలాంటి సౌకర్యం ఏర్పాటు చేయడం లేదని, కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఎందుకు చేపట్టడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇకపోతే భక్తులు మేకలను మొక్కుబడులు తీర్చుకోవడం కోసం వదిలి పెడతారు అలా వదిలి పెట్టిన మేకలను వక్కు బోర్డు వారు చనిపోయినాయని కొండల ఏదైనా మేక చనిపోతే వాటి ఫోటోలు తీసుకుని వాగ్బార్డ్ వారికి ఇస్తూ మేకలను అధిక రేట్లకు విక్రయాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని మేకలను అమ్ముకుంటూ పక్కదోవ పట్టిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. వక్కు బోర్డు వారు దోపిడీ రోజు రోజుకు అధికం చేస్తున్నారని దీనిపై వక్కు బోర్డు వారు జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు. పెద్దగుట్ట కొండపై ఉన్న దర్గా దర్శనం కోసం వెళ్లడానికి సిద్దాపూర్ నుంచి ఒక దారి ఉందని అదేవిధంగా పెద్దగుట్ట బస్టాండ్ నుంచి ఒక దారి ఉందని ఈ దారుల గుండా రవాణా సౌకర్యాలు వాహన సౌకర్యాలు భక్తులకు మెరుగ్గా కల్పించడానికి ఉన్నప్పటికీ, ఇక్కడున్న వారు కొంతమంది అడ్డుకుంటున్నారని ఒకవేళ ఆ మార్గం కల్పిస్తే భక్తులకు. కొండపైకి కాలినడకన వచ్చే బాధలు ఉండబోవు అని ఇక్కడ ఉన్న వారు కొంతమంది వారి యొక్క స్వార్థం కోసం రవాణా సౌకర్యం, రహదారి సౌకర్యం ఏర్పాటు చేయకుండా అడ్డుపడుతున్నారని, ఒకవేళ కొంతమంది అడ్డుపడకుండా ఉంటే రవాణా సౌకర్యం అనగా వాహనాలు కొండపైకి వచ్చే అవకాశాలు ఉంటాయని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వారి యొక్క మొక్కుబడును తీర్చుకుంటారని వారు ఇబ్బందులు పడే, అవస్థలు ఉండబోవు అని పలువురు అంటున్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india