Post Views: 115
సర్పంచ్ రేసులో మాజీ సర్పంచ్ భార్య….

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో గత పది సంవత్సరాలుగా రుద్రూర్ గ్రామ సర్పంచిగా ఇందూరు చంద్రశేఖర్ తనదైన శైలితో సేవలు అందించారు. అయితే రానున్న సర్పంచ్ ఎన్నికల్లో రుద్రూర్ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేవారు మహిళ అభ్యర్థి అయి ఉండాలని రిజర్వేషన్ రుద్రూర్ గ్రామానికి రావడం జరిగింది. అయితే రుద్రూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్ సతీమణి రానున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తారని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున రుద్రూర్ మండల జడ్పిటిసి అభ్యర్థిగా ఇందూర్ సునీత పోటీచేసి ఓడిపోయారు. అయితే రానున్న సర్పంచ్ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆమెకే టికెట్ ఇస్తుందని రాజకీయ మేధావులు చెబుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








