V1News Telangana

best news portal development company in india

ఉట్పల్లి ఆరో నెంబర్ తాండ లో పేకాట… ఒక్కో ఆటకు 5 వేలకు పైగా కటింగ్… నిజామాబాద్ జిల్లా నుంచి తరలివస్తున్న పేకాట రాయులు…

SHARE:

ఉట్పల్లి ఆరో నెంబర్ తాండ లో పేకాట…
ఒక్కో ఆటకు 5 వేలకు పైగా కటింగ్..
.నిజామాబాద్ జిల్లా నుంచి తరలివస్తున్న పేకాట రాయులు…

నిజామాబాద్ జిల్లాలోని ఊటుపల్లి తండా మరియు కొత్తపేట ప్రాంతాల్లో పేకాట జోరుగా నడుస్తుందని విశ్వాసనీయ సమాచారం ఇస్తున్నారు స్థానిక ప్రజలు. ఉట్పల్లి ఆరో నెంబర్ తండాలోని పంట పొలాల్లో అదేవిధంగా కొత్తపేట ప్రాంతంలో నలుగురు పేకాట నిర్వాహకులు కలిసి పేకాటను లక్షలో నడిపిస్తున్నారట, కొత్తపేట గ్రామానికి చెందిన ఇద్దరు, ఉట్టపల్లి గ్రామానికి చెందిన ఒకరు, నాగారం గ్రామానికి చెందిన మరొకరు కలిసి జూదాన్ని జోరుగా నిర్వహిస్తున్నారట. ఆర్మూర్ బోధన్ నిజామాబాద్ ప్రాంతాల నుంచి ఈ పేకాట రాయలు ఎక్కువ మోతాదులో వస్తున్నారట. అందర్ బాహేర్ అనే ఆటతో నిమిషంలోనే లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు పేకాట రాయులు. పేకాట ఆడడానికి డబ్బులు లేకపోతే ఇంట్లో ఉన్న బంగారు అభరణాలను తాకట్టుపెట్టి, ద్విచక్ర వాహనాలను తాకట్టుపెట్టి పేకాట ఆడడానికి వస్తున్నారట. గతంలో ఎంతో మంది పేకాట ఆడి ఓడిపోయినా వారు తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. పేకాటలో ఓడిపోతే ఇంట్లో వచ్చి చిత్రహింసలు పెట్టడం కొట్టడం లాంటి పనులు జరుగుతాయి ఈ పేకాట ఎంతోమంది కుటుంబాలను రోడ్డుపాలు చేసింది. ఇలాంటి పేకాట ఆట నిర్వహిస్తున్న నిర్వాహకులపై సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి పూర్తిస్థాయిలో ఉట్పల్లి ఆరో నెంబర్ తండాలో నడుస్తున్న పేకాటను నిలిపివేయాలని పేకాట నిర్వహిస్తున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india