V1News Telangana

best news portal development company in india

ఏత్తోండా –రాయికూర్ అడవి అంచుల్లో పేకాట మామూలైంది! దేవా గ్యాంగ్ దర్జాగా కాన్సా పంట పొలాల సరిహద్దుల్లో రమ్మీ రచ్చ… దేవా గ్యాంగ్‌కు ఎవరూ అడ్డు ఎందుకు? కవరింగ్ బాయ్‌లతో కట్టుదిట్టం… దేవా గ్యాంగ్ పేకాట కేంద్రాలపై గ్రామస్థుల ఆగ్రహం చుట్టుపక్కల గ్రామాల ఆటగాళ్ల రద్దీ… పోలీసుల దృష్టికి ఎప్పుడిది?

SHARE:

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం
ఎత్తుండా–రాయికూర్ (V1 NEWS):

ఏత్తోండా, రాయికూర్ పరిసరంలోని అడవి అంచులు, పంట పొలాల సరిహద్దులు ఇటీవల అక్రమ పేకాట కేంద్రాలుగా మారిపోయాయి. దేవా గ్యాంగ్ అనే గుంపు రోజూ భారీ స్థాయిలో పేకాట‌ను నిర్వహిస్తున్నట్లు స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

అడవి లోతుల్లో గుర్తుపట్టలేని ప్రదేశాలు, లోపలి బాటలు, పంట పొలాల మధ్య గల గుంతల వద్ద కవరింగ్ బాయ్‌లను ఏర్పాటు చేసి… ఏ అధికారుల కంటపడకుండా ప్రతిరోజూ మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పేకాట సెషన్‌లు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

రోజుకు 5 నుంచి 15 లక్షల వరకు డబ్బు తిరుగుతోందా?

స్థానికుల సమాచారం ప్రకారం ప్రతిరోజూ ఐదు లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు నగదు బెట్టింగ్ జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
గ్యాంగ్ నిర్వాహకులు ప్రతిరోజూ వేదికలు మారుస్తూ, అడవి అంచులు–పంట పొలాల సరిహద్దుల్లో స్థానం మార్చుకుంటూ పేకాటను కొనసాగిస్తున్నారని చెబుతున్నారు.

గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఆటగాళ్ల రాక

చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుండి పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు ప్రతిరోజు ఇక్కడికి చేరుతుండడంతో పరిస్థితి రోజురోజుకూ అదుపు తప్పుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

> “ఇక్కడ పేకాట మామూలైంది. పోలీసులు వస్తారనే భయం లేదు. ఎవరి చేతిలోనూ పట్టుబడకుండా ప్రతిరోజూ ఆటలు సాగుతున్నాయి”
అని గ్రామస్థులు విసుగ్గా చెబుతున్నారు.

 

యువత దారి తప్పుతోందని పెద్దల ఆందోళన

పేకాట కేంద్రాల్లాంటి అక్రమ ప్రదేశాల్లో యువత పోగవుతుండటం, రాత్రి వేళల్లో అసాంఘిక వ్యక్తుల రాకపోకలు పెరగడం వల్ల గ్రామ భద్రత దెబ్బతినుతోందని పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ప్రశ్నలు

భారీ స్థాయిలో పేకాట జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? అనే ప్రశ్నలు కూడా ప్రజల్లో వినిపిస్తున్నాయి.
స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఏ చర్యా కనిపించకపోవడం… అధికారుల తీరు పట్ల అనుమానాలు పెంచుతోంది.

 

తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్

అడవి ప్రాంతాల్లో నెలకొన్న ఈ అక్రమ పేకాట కేంద్రాలను వెంటనే అరికట్టాలని, దేవా గ్యాంగ్‌పై కఠిన చర్యలు తీసుకొని గ్రామ పరిసరాలను శాంతియుత ప్రాంతాలుగా మార్చాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
లేకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india