పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలంటూ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాలు
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. గారి ఆధ్వర్యంలో బోధన్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు.
సమావేశంలో చర్చించిన ముఖ్య అంశాలు
1. పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారం
డివిజన్లో పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను ప్రాధాన్యంగా తీసుకుని శీఘ్రంగా పరిష్కరించాలన్నారు.
గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులపై నాణ్యమైన, పారదర్శకమైన విచారణ జరిపి చార్జ్షీట్లు త్వరితగతిన దాఖలు చేయాలని సూచించారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
2. పోక్సో, గ్రేవ్ కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు
పిల్లలపై నేరాలు మరియు ఇతర తీవ్రమైన కేసుల్లో వెంటనే దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జ్షీట్లను సమర్పించాలని ఆదేశించారు.
సి.సి.టి.ఎన్.ఎస్ వ్యవస్థపై అన్ని అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.
3. అసాంఘిక కార్యకలాపాలపై పటిష్ట చర్యలు
గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు, జూదం, పి.డి.యస్ రైస్ అక్రమ రవాణా వంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వరుసగా నేరాలకు పాల్పడే వారిపై PD యాక్ట్ ప్రకారం చర్యలకు ప్రతిపాదనలు పంపాలని తెలిపారు.
. సైబర్ నేరాలపై అవగాహన
ప్రజలు, విద్యార్థుల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.
ఆన్లైన్ మోసాలకు గురైనవారు 1930 నంబర్‌కు కాల్ చేయాలి లేదా ఎన్సీఆర్పీ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని వివరించారు.
. రోడ్డు ప్రమాదాల నివారణ
ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలి.
హైవేలకు కలిసే లింక్ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి.
రోడ్డు ఇంజనీరింగ్ లోపాలను సంబంధిత శాఖలతో సమన్వయంగా పరిష్కరించాలన్నారు.
డ్రంకెన్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, మైనర్లు వాహనాలు నడపడం వంటి నిబంధనల ఉల్లంఘనపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలన్నారు.
ప్రజలకు రోడ్డు భద్రత నిబంధనలపై విస్తృతమైన అవగాహన కల్పించాలని సూచించారు.
6. విజిబుల్ పోలీసింగ్ – నేర నియంత్రణ
పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పాత నేరస్థుల కదలికలను పర్యవేక్షించాలని తెలిపారు.
7. గ్రామాల్లో కమ్యూనిటీ పోలీసింగ్
వి.పి.ఓలు గ్రామాలను ప్రతిరోజూ సందర్శించి ప్రజలతో మమేకమవుతూ నేరాలను నియంత్రించాలన్నారు.
గ్రామాల్లో సి.సి కెమెరాల ఏర్పాటు పై అవగాహన కల్పించి వాటి ఏర్పాటు కోసం కృషి చేయాలని సూచించారు.
సమావేశంలో పాల్గొన్న వారు
బోధన్ ఏసీపీ శ్రీ పి. శ్రీనివాస్, బోధన్ ఎస్హెచ్ఓ శ్రీ వి. వెంకట్ నారాయణ, సిఐ రుద్రూర్ శ్రీ కృష్ణ, ఎస్ఐలు మచ్చేందర్ (బోధన్ రూరల్), రమ (ఎడపల్లి), చంద్రమోహన్ (రెంజల్), సునీల్ (కోటగిరి), సాయన్న (రుద్రూర్), ఏఎస్ఐ రామరాజు (వర్ని), సిసి ఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీ రమేష్ (ఇన్చార్జ్) తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








