Post Views: 91
— వృధాగా పాడుతున్న కులాయి నీరు.–
— మురుగు కాలువలకు ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించారు.
— తొలగించిన పిచ్చి మొక్కలను కుప్పచేసి మరిచారు.
— గ్రామ కార్యదర్శి విధి నిర్వహణ నిర్లక్ష్యానికి నిదర్శనాలు.
బోధన్ : సాలూర మండలం కుమ్మన్ పల్లి
గ్రామంలోని పలు కాలనీలలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా దర్శనం ఇస్తుంది.అదేవిధంగా అక్కడక్కడ కుళాయి నీరు వృధాగా పోతుంది.రోడ్లపై నీరు నిలిచి ఉంటుంది.సహకార గోదాంల ప్రాంతంలో నీరు నిలవడంతో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి.దుర్గంధం వెదజల్లుతుంది.గ్రామ కార్యదర్శికి మండల ఇంచార్జ్ ఎంపీఓగా అధికార యంత్రాంగం బాధ్యతలను కట్టబెట్టినప్పటికీ విధి నిర్వహణ వీధికి వదిలేసినట్లుగా ఉందని పలు కాలనీల ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు.గ్రామంలోని కొన్ని కాలనీలను మాత్రమే శుభ్రంగా ఉంచుతు ఇందిరమ్మ కాలనీ వైపు కార్యదర్శి కన్నెత్తి చూడకపోవడం కార్యదర్శి నిర్లక్ష్యానికి నిదర్శనం అని చెప్పవచ్చు.శుభ్రం చేయమంటే దుర్భాషలాడటం లాంటి సందర్భాలు లేకపోలేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరుగు కాలువలకు ఇరువైపుల మొలిచిన పిచ్చి మొక్కలను తొలగించినప్పటికీ పిచ్చి మొక్కల కుప్పలను అట్లాగే ఉంచి పారిశుధ్య లోపాలకు అద్దం పట్టేలా కార్యదర్శి వ్యవహారం తేటతెల్లమవుతుంది.ఇలాంటి కార్యదర్శి వ్యవహార శైలిపై మండల మరియు ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









