సామర్థ్యానికి మించి ఇసుక… నియమాలు పక్కనబెట్టి టిప్పర్ల దుమారం!
గ్రీన్ మ్యాట్ లేకుండా రవాణా… భూగర్భ వనరుల చట్టాలపై అధికారులే చేయివేసినట్టా?
ఓవర్లోడ్తో పరుగులు… తగ్గేల్లి–నిజామాబాద్ మార్గం ఇసుక ట్రాఫిక్కు తలవంచిందా?
నిబంధనలు పాదం… బాధ్యత ఉన్న అధికారులు మాత్రం కళ్లుమూశారా?
వాహనాలు దూసుకుపోతున్నా… ‘సిబ్బంది తక్కువ’ అనే తాసిల్దార్ సమాధానం సరిపోతుందా?
బోధన్, నవంబర్ 21 (v1news):
మంజీరా పరివాహక ప్రాంతంలోని సాలుర మండలంలో తగ్గేల్లి శివారులో గురువారం నుంచి ఇసుక రవాణా ప్రారంభింది. మంజీరా నది నుంచి ట్రాక్టర్లతో తెచ్చిన ఇసుకను తగ్గేల్లి వద్ద నిల్వ చేసి, అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా నిజామాబాద్లో కొనసాగుతున్న ఇందిరమ్మ గృహాల నిర్మాణాలకు పంపిస్తున్నారు.

కానీ ఈ రవాణా పూర్తిగా నియమాల్ని పక్కనబెట్టి జరుగుతున్నట్టు టిప్పర్ల లో స్పష్టంగా కనిపిస్తోంది.

ఓవర్లోడ్ టిప్పర్లు — RTO ఎందుకు కనిపించడం లేదు?
రవాణా శాఖ (RTO) పర్యవేక్షణలో ఉండాల్సిన ఈ వాహనాలపై
➡ ఒక్క టిప్పర్ కూడా ఆపబడకపోవడం,
➡ రోజుకు వందలాది టిప్పర్లు ఓవర్లోడ్తో వెళ్లిపోవడం,
➡ చెకింగ్ ఒక్కటీ జరగకపోవడం…
ప్రజల్లో పెద్ద ప్రశ్నలకు దారితీస్తోంది.
“RTO ఉన్నా… చర్యలు లేవా?”
“ఓవర్లోడ్ చేయడానికి ఎవరి ఆశీస్సులు?”
ఇది చూసిన స్థానికుల్లో వినికిడి—
“రూల్స్ అమలు కాకపోవడానికి కొంతమంది స్థానిక రాజకీయ నాయకుల అనుచరులు కూడా అక్కడే తిరుగుతున్నారని చెప్పుకుంటున్నారు” అని మాటలంటున్నారు.
12 టన్నుల సామర్థ్యం… కానీ 18 టన్నుల వరకు లోడ్!
అనుమతిప్రకారం 12 టన్నులకే పరిమితమైన టిప్పర్లలో
15–18 టన్నుల వరకు ఇసుక నింపి పంపిస్తున్నారని స్వయంగా డ్రైవర్లు చెబుతున్నారు.
➡ వాహనాలకు బద్దీలు వేసి సామర్థ్యాన్ని పెంచడం,
➡ ఫిట్నెస్ సర్టిఫికేట్ తనిఖీలు లేకపోవడం…
రవాణా శాఖ మౌనం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
గ్రీన్ మ్యాట్ లేదు—మూడు శాఖలూ మౌనంలోనే?
గ్రీన్ మ్యాట్ తప్పనిసరి అని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ
ఒక్క వాహనంపైనా అమలు కనిపించడం లేదు.
➤ రెవెన్యూ శాఖ పర్యవేక్షణ ఎక్కడ?
➤ మైనింగ్ శాఖ తనిఖీలు జరిగాయా?
➤ RTO రోడ్డు మీద రూల్స్ అమలు చేస్తుందా?
మూడు శాఖలు మౌనంగా ఉండటంపై ప్రజలు మండిపడుతున్నారు.

“సిబ్బంది తక్కువ” — తాసిల్దార్ సమాధానం సరిపోతుందా?
రెవెన్యూ అధికారులు “మన దగ్గర సిబ్బంది తక్కువ” అంటున్నారు.
కానీ ప్రజలు అడిగే ప్రశ్న స్పష్టమే—
➡ ఓవర్లోడ్ ఆపేది RTO కదా?
➡ లోడింగ్ పరిమితి అమలు చేయేది RTO కదా?
➡ వాహన ఫిట్నెస్ చూడటమే RTO బాధ్యత కదా?
అయితే ఎందుకు నిబంధనలు నేలమట్టం అవుతున్నాయి?
పోలీసులు గస్తీ లో ఉన్నా… అమలు మాత్రం శూన్యం!
స్థానికులు చెబుతున్నదేమంటే—
• పోలీసులు ప్రాంతంలో ఉన్నప్పటికీ
• ఓవర్లోడ్ వాహనాలు
• గ్రీన్ మ్యాట్ లేని టిప్పర్లు
అలాగే దూసుకుపోతున్నాయి.
ఇది ప్రజల్లో మరో అనుమానం రేకెత్తిస్తోంది—
“RTO–రెవెన్యూ–మైనింగ్–పోలీసులు… నాలుగు శాఖలు కలిసి కళ్లుమూసుకున్నట్టేనా?”
ప్రజల్లో ఆందోళన — ప్రమాదాలు పెరగబోతున్నాయి
ఇలాగే కొనసాగితే—
• రోడ్ల దెబ్బతినడం
• నియంత్రణ కోల్పోయే ప్రమాదాలు
• ధూళి కాలుష్యం
• గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు పెరగడం

పరిణామాలే.
ప్రజల ప్రశ్న ఒకటే—
“ఈ అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు?”
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









