Post Views: 55
ఇంటి ఎదుట ఉన్న ముళ్ళపదలు పిచ్చి మొక్కల ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
మోస్రా

నిజామాబాద్ జిల్లా మోసరా మండలం గోవురు గ్రామంలోని ఓ ఇంటి ఎదుట ఓ ప్రైవేటు వ్యక్తికి సంబంధించిన ప్లాట్ ఉందని ఈ ప్లాట్ లో కొన్ని సంవత్సరాలు నుంచి పిచ్చి మొక్కలు ముళ్ళపదలు పెరిగి విషె సర్పాలు, పాములు, విష జంతువులు వస్తున్నాయని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ ప్రజలు తెలిపారు. ఈ విషయం గురించి గ్రామపంచా అధికారులకు చాలా సార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవడంలేదని కాలనీ ప్రజలకు భయం వేస్తుందని ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.
అదేవిధంగా ఓ ఇంటి నుంచి సెప్టిక్ ట్యాంకు సంబంధించిన మురికి నీటి కలెక్షన్ డ్రైనేజీల వదలడం వల్ల కూడా కంపు కొడుతుందని కాలనీ ప్రజలకు విముక్తి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయం చాలా సార్లు పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు దీనిపై చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









