నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామంలో ఆర్టీవో చాలన్ పేరిట ఒక అప్లికేషన్ ఎక్కువ మోతాదులో వైరల్ అవుతుంది. మనం పర్మిషన్ ఇవ్వకుండానే ఆటోమేటిక్గా మన కాంటాక్ట్ లకు ఆ అప్లికేషన్ యొక్క లింకు ఫార్వర్డ్ అవుతుంది ఆర్టిఓ చాలన్ పేరిట వచ్చిన అప్లికేషన్ లింకును డౌన్లోడ్ చేస్తే ఇక అంతే పని రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన అల్తాఫ్ అనే యువకుడికి ఎక్కడి నుంచో ఆర్టీవో చాలన్ పేరిట ఆ లింకు తన వాట్సాప్ లో వచ్చిందట,తన అనుమతి లేకుండానే తన వాట్సాప్ నుంచి తన ఫ్రెండ్స్ కు మరియు తన చుట్టాలకు ఆటోమేటిగ్గా అప్లికేషన్ లింకు ఫార్వర్డ్ అవుతుందని తన వాట్సప్ సైతం లాక్ అయిపోయిందని తెలిపాడు. అదేవిధంగా సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన రియాజ్ తన వాట్సాప్ నుంచి అనుమతి లేకుండానే ఎంతోమందికి ఫార్వర్డ్ అయినట్లు తన వాట్స్అప్ కూడా బ్లాక్ అయినట్లు తెలిపారు. సైబర్ మోసగాళ్లు చేస్తున్న ఈ మోసం నుంచి రుద్రూర్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి అప్లికేషన్ లింకులు వచ్చిన మొదటగా ఎవరైతే పంపుతారో వారిని ఫోన్ కాల్ ద్వారా తెలుసుకొని ఆ అప్లికేషన్ను డౌన్లోడ్ చేయాలి అపరిచితుల నుంచి వచ్చిన లింకులను అసలు డౌన్లోడ్ చేయకూడదు బాధితులు సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలి సైబర్ క్రైమ్ ఫోన్ నెంబర్ 1930కి కాల్ చేయాలి. రుద్రూర్ మండల పోలీస్ శాఖ అధికారులు దీనిపై వెంటనే స్పందించి ప్రజలకు జరుగుతున్న సైబర్ మోసం నుంచి కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








