V1News Telangana

best news portal development company in india

పదో తరగతి పరీక్ష ఫీజుల పేరుతో దోపిడి ఆపాలని విద్యార్థి పరిషత్ డిమాండ్

SHARE:

బోధన్, నవంబర్ 13:
తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బోధన్ మండల విద్యాశాఖ కార్యాలయంలో పదవ తరగతి పరీక్ష ఫీజుల దోపిడి పై మెమోరాండం సమర్పించారు.

ఈ సందర్భంగా టీజీవీపీ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలే నాగేష్ మాట్లాడుతూ, “ప్రభుత్వం నిర్ణయించిన పరీక్ష ఫీజు ₹125 మాత్రమే అయినప్పటికీ, కొంతమంది ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుండి ₹1000 నుండి ₹2000 వరకు వసూలు చేస్తున్నాయి. ఇది పూర్తిగా అన్యాయం మరియు దోపిడి చర్య,” అని విమర్శించారు.

ప్రైవేట్ పాఠశాలలు వసూలు చేస్తున్న అదనపు మొత్తాన్ని వెంటనే తల్లిదండ్రులకు తిరిగి ఇవ్వాలని, అలాగే దోపిడీ చేస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ విషయాన్ని డీఈఓ గారికి మరియు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో టీజీవీపీ బోధన్ డివిజన్ కార్యదర్శి నిఖిల్, పట్టణ కార్యదర్శి వీరేష్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india