సాలూర మండలం, నవంబర్ 2:
మంజీర నది ఇసుకను మాఫియా బంగారం లాగా తవ్వేస్తున్నారు. సాలూర మండలంలోని మంధర్నా గ్రామ పరిధిలో రాత్రింబవళ్లు ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో ఇసుక దందా మరింత ఉద్ధృతంగా సాగింది.
స్థానికులు చెబుతున్నదేమిటంటే — పాలు శాఖల “మౌన ఆశీర్వాదం” లేకుండా ఈ రవాణా జరగదట. ఇసుక ట్రాక్టర్లు దూసుకెళ్తున్నా,ఆదికారు లు ఏమాత్రం స్పందించడం లేదు.
ద్విచక్ర వాహనదారులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. రహదారులపై వడ్లు పరుచుకున్నా, వాటి మీద నుంచే ట్రాక్టర్లు దూసుకుపోతున్నాయి. కొందరు అధికారులు మామూలు తీసుకొని ఈ అక్రమ రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని గ్రామస్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
ప్రజల డిమాండ్:
జిల్లా కలెక్టర్, ఎస్పీలు జోక్యం చేసుకొని ఇసుక మాఫియా రాజ్యాన్ని కూలదోసి, అధికారుల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, రైతులు గళమెత్తుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








