గత కొద్ది రోజుల క్రితం సులేమాన్ నగర్ గ్రామంలో 2 బిహెచ్కె డబుల్ బెడ్ రూమ్ లో తమకు న్యాయం జరగలేదని 14 మంది హైదరాబాద్లోని హౌసింగ్ బోర్డ్ కార్యాలయం నందు వెళ్లి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.దాని పై స్పందించి సత్య అసత్యాలను గ్రహించడానికి హైదరాబాద్ నుంచి హౌసింగ్ బోర్డ్ అధికారులు నిజామాబాద్ జిల్లాలోని సులేమాన్ నగర్ గ్రామంలో కట్టిన 2బిహెచ్కె ఇళ్ల దగ్గరకి వెళ్లి అ 14 మంది బాధితులతో మాట్లాడి రిపోర్టు నమోదు చేసుకొని వెళ్లారు. ఒకవేళ అవకతవకలు జరిగితే వాటిపైన చర్యలు ఉంటాయని హైదరాబాద్ హౌసింగ్ బోర్డ్ డిప్యూటీ అశోక్ కుమార్ తెలిపారు.2బిహెచ్కే డబల్ బెడఁరూం బిల్లులో అవకతవకలు జరిగాయా లేక ఇవి ఆరోపణలు మాత్రమేన అనే విషయాన్ని తొందర్లోనే బయటపెడ్తామని హౌసింగ్ హైదరాబాద్ బోర్డు అధికారులు తెలిపారు.హౌసింగ్ బోర్డు హైదరాబాద్ డిప్యూటీ అశోక్ కుమార్ తో పాటు నిజామాబాదు జిల్లా హౌసింగ్ బోర్డు డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఆయన తో పాటు తనిఖీలు నిర్వహించారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








