V1News Telangana

best news portal development company in india

320 క్వింటాల వరి ధాన్యం లారిని పట్టుకున్న అధికారులు…. వరి ధాన్యం లారీని పట్టుకున్నారు మరి దానిపై కేసు నమోదు చేశారా..?

SHARE:

అక్రమంగా తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యాన్ని తీసుకొచ్చిన చర్యలు శూన్యమా..?
లేకుండా లారీని వదిలేయడం చట్టమేనా?
చెక్క్‌పోస్ట్ వద్ద లారీ ఆపి వదిలేశారు –
ధాన్యం దోపిడీపై అధికారులు మౌనమే ఎందుకు?
. వరి లారీని పట్టుకొని తిరిగి పంపడం – చట్టానికి విరుద్ధమా?
అక్రమ వరి రవాణాపై కఠిన చర్యలు ఎక్కడ?
. ప్రజల ప్రశ్న – అక్రమ లారీలకు “పాస్” ఎవరిది?

తెలంగాణ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం 31 అక్టోబర్ రోజున మహారాష్ట్ర నుంచి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న వరి ధాన్యం లారీని అధికారులు పట్టుకోవడం జరిగింది.

. ఇతర రాష్ట్రాల నుంచి వేబీలు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం లారీలను అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. మహారాష్ట్ర నుంచి 70 కిలోల బస్తాలతో దాదాపు 320కిలో గల వరి ధాన్యాన్ని లారీ ని అధికారులు పట్టుకున్న దానిపై కేసు చేయకుండా రిటర్న్ పంపించారని ఇలా అక్రమంగా వస్తున్న లారీని పట్టుకోవడం మరియు ఆ తర్వాత వదిలేయడం చట్టపరమేనా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకపై కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీలపై తనిఖీలు ఆ లారీలను ధాన్యాన్ని అదుపులో తీసుకుంటారా లేకుంటే వాళ్లను కూడా అదే విధంగా తిరిగి పంపిస్తారా అనే మాటలు ప్రశ్నార్ధికారంగా మారాయి. అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వరి ధాన్యం దోపిడీని ఆపాలంటే దొంగ చాటుగా వస్తున్న వరి ధాన్యం లారీల యజమానులపై ఆ వాహనాలపై కేసులు నమోదు చేయాలనీ స్థానిక ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india