Post Views: 411
ప్రజల వద్ద డబ్బులు డిమాండ్ చట్టపరమేనా..?
నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలోని మండలాల్లో పాస్పోర్టింగ్ ఎంకోరి కోసం వస్తున్న అధికారులు తమ వద్ద నుండి వేల రూపాయలు తీసుకుంటున్నారని ప్రజలు నిరాశ చెందుతున్నారు. ఆధార్ కార్డు అడ్రెస్స్ సరిగ్గా లేదని మరికొందరికి సర్టిఫికెట్ సరిగా లేవని చెబుతూ వాళ్ళ వద్ద నుండి 1000 నుంచి 3000 రూపాయలు తీసుకుంటున్నట్టు.?విశ్వాసనీయ సమాచారం. లంచం ఇచ్చినవారు ముందుకు వచ్చి చెప్పడానికి భయబ్రాంతులకు గురవుతున్నారు! ఎక్కడ వాళ్ళ పాస్‌పోర్ట్ క్యాన్సల్ చేస్తారేమో అని ఈసిఎన్ఆర్ ఈసీఆర్ పాస్‌పోర్ట్ ప్రాసెసింగ్ లో క్లీన్ చీట్ ఇవ్వడానికి పాస్‌పోర్ట్ ఎంక్వయిరీ అధికారులు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు ఇవ్వని ఎడల పాస్‌పోర్టులో తప్పు ఉందని సమాచారం ఇస్తామంటు భయపడుతున్నారట.? నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ గారు పాస్‌పోర్ట్ ఎంక్వైరీ కోసం వస్తున్న అధికారులపై ప్రత్యేక దృష్టి సారించి సత్య సత్యాలను తెలుసుకొని అవినీతి చేస్తున్న వారి పైన చర్యలు తీసుకొని అవినీతిపరుల బారి నుండి ప్రజలను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు…. 🙏
Author: IRFAN Reporter
Work from as a journalist








