నిజామాబాద్, అక్టోబర్ 27:
తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పది మంది పోలీస్ కానిస్టేబుళ్లు (PCలు) హెడ్ కానిస్టేబుళ్లుగా (HCలు) పదోన్నతి పొందారు.
ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన సిబ్బంది నేడు గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ప్రమోషన్ల కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్న సిబ్బందికి పదోన్నతి లభించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సాయి చైతన్య గారు వారిని అభినందిస్తూ, “సేవా నిబద్ధతతో, క్రమశిక్షణతో, ప్రజల నమ్మకాన్ని పొందే విధంగా భవిష్యత్తులోనూ తమ విధులను నిర్వర్తించాలి” అని సూచించారు.
పదోన్నతి పొందిన సిబ్బంది వివరాలు:
1. శ్రీ ఏ. లింబాద్రి, PC 1750 – రెంజల్ PS → జగిత్యాల జిల్లా
2. శ్రీ కె. చిన్నయ్య, PC 418 – కోటగిరి PS → జగిత్యాల జిల్లా
3. శ్రీ పి. గణేష్, PC 1506 – నిజామాబాద్ రూరల్ PS → జగిత్యాల జిల్లా
4. శ్రీ కే. యాదవ్, PC 1718 – మాక్లూర్ PS → జగిత్యాల జిల్లా
5. శ్రీ ఏ. వరప్రసాద్, PC 1114 – కమ్మర్పల్లి PS → జగిత్యాల జిల్లా
6. శ్రీ ఎం.డి. ఆరిఫుద్దీన్, PC 581 – నిజామాబాద్ టౌన్-II PS → జగిత్యాల జిల్లా
7. శ్రీ సి.హెచ్. శేఖర్, PC 1696 – PCR, నిజామాబాద్ → జగిత్యాల జిల్లా
8. శ్రీ డి. శ్రీనివాస్ రావు, PC 305 – నవీపేట్ PS → జగిత్యాల జిల్లా
9. శ్రీ జి. శ్రీనివాస్, PC 1681 – భీంగల్ PS → జగిత్యాల జిల్లా
10. శ్రీ రాంచందర్, PC 1715 – ఇంటెలిజెన్స్ OD → జగిత్యాల జిల్లా
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








