V1News Telangana

best news portal development company in india

భైంసా మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్‌ను కచ్చితంగా అమలు చేయాలి – కలెక్టర్ అభిలాష అభినవ్

SHARE:

నిర్మల్, అక్టోబర్ 25:
భైంసా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఐఏఎస్. అధికారులను ఆదేశించారు.

శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో, అమృత్ 2.0 పథకం కింద మాస్టర్ ప్లాన్ అమలుపై నిర్వహించిన మొదటి కన్సల్టేటివ్ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “భైంసా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ కీలకంగా మారుతుంది” అని తెలిపారు.

ఇప్పటికే సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డ్రోన్ సర్వే, సోషియో-ఎకనామిక్ సర్వే పూర్తయ్యాయని చెప్పారు. వివిధ శాఖల అధికారులు తమ విభాగాలకు సంబంధించిన డేటాను 15 రోజులలోగా సమర్పించాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు, భవిష్యత్తు ప్రణాళికలు, అవసరమైన మౌళిక సదుపాయాల వివరాలను సమగ్రంగా అందించాలని సూచించారు.

మాస్టర్ ప్లాన్ అమలుతో భైంసాలో పారిశుధ్యం, త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ వంటి మౌళిక సదుపాయాలు మెరుగుపడతాయని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, జిఐఎస్ హబ్ డిటిసిపి ప్రాజెక్ట్ డైరెక్టర్ అశ్వినీ యాదవ్, డిటిసిపివో వరంగల్ ఆర్డీ జ్యోతి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india