నిజామాబాద్, అక్టోబర్ 25:
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో సైకిల్ / బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. గారు పూలాంగ్ చౌరస్తా వద్ద నుండి ఉదయం 9:30 గంటలకు ప్రారంభించారు.ర్యాలీ పూలాంగ్ చౌరస్తా నుండి ప్రారంభమై దేవి రోడ్డు చౌరస్తా – కోర్టు చౌరస్తా – గ్లామర్ హోటల్ చౌరస్తా – చెన్నై షాపింగ్ మాల్ చౌరస్తా – ఆర్.టి.సి బస్టాండ్ – ప్రభుత్వ ఆస్పత్రి – దేవి రోడ్డు చౌరస్తా – గాంధీ చౌక్ – నెహ్రూ పార్క్ చౌరస్తా వరకు కొనసాగింది.ఈ సందర్భంగా కమిషనర్ పి. సాయి చైతన్య మాట్లాడుతూ, “దేశం లో అంతర్గత భద్రత, శాంతి కాపాడటానికి ఎన్నోమంది పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారి త్యాగాల వలననే మనం నేడు సురక్షితంగా జీవిస్తున్నాం,” అని అన్నారు.అలాగే, నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రజల రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ప్రజలు ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.కమిషనర్ గారు మాట్లాడుతూ, “మన పోలీసులు ఒక కుటుంబం వంటివారు. వారు వేసుకున్న యూనిఫాం గర్వకారణం. వారి త్యాగాల వల్లనే మన సమాజం ప్రశాంతంగా ఉంది. న్యాయం కోసం, సేవ కోసం ఎప్పటికీ తలవంచక సేవ చేయాలనే ప్రమాణం చేద్దాం,” అన్నారు.ఈ సందర్భంగా అమరవీరుల వారోత్సవాల భాగంగా అక్టోబర్ 29న రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరూ అందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు బస్వారెడ్డి (అడ్మిన్), రామ్ చందర్ రావు (ఎ.ఆర్.), ట్రాఫిక్ ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, మస్తాన్ అలీ, సీఐలు, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆర్మ్డ్ రిజర్వు సిబ్బంది, స్పెషల్ పార్టీ, ఎన్‌సీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








