Post Views: 617
బోధన్ నుంచి రుద్రూర్ వెళ్లే రోడ్డు మార్గంలో గల పసుపు వాగు దగ్గర లోతులో గల బ్రిడ్జి వద్ద ఐచర్ మరియు బొలెరో వాహనాలు ఢీకొన్నయి అయితే బ్రిడ్జ్ కి అడ్డంగా ఐచర్ మరియు బొలెరో పికప్ బ్రిడ్జి కింద పడిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఐచర్ను క్రేన్ సహాయంతో బ్రిడ్జి దగ్గర నుంచి జరిపే ప్రయత్నాలు చేస్తున్నారు బ్రిడ్జ్ కి అడ్డంగా ఐచర్ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు కిలోమీటర్ వరకు అటువైపు ఇటువైపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఐచర్ను జరపడానికి క్రేన్ సహాయం తీసుకొన్ని బోధన్ పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎంతో సమయం పట్టొచ్చు చెప్పలేము బైక్ కూడా వెళ్లడానికి మార్గం లేకుండా బ్రిడ్జ్ కు ఐచర్ వాహనం ఉంది రాకపోకలకు వెళ్లే వాహనదారులు ఉన్నచోటనే నిలిచిపోయారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








