V1News Telangana

best news portal development company in india

సాలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం — రైతులకు ఊరట

SHARE:

సాలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం — రైతులకు ఊరట
సాలూరు, అక్టోబర్ 16 (వీ1 న్యూస్):
సాలూరు మండల కేంద్రంలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరా శాఖ పర్యవేక్షణలో ప్రారంభించారు.
కేంద్రాల ప్రకారం గ్రేడ్ ‘ఏ’ ధాన్యానికి క్వింటాలుకు ₹2,389 మరియు గ్రేడ్ ‘బి’ ధాన్యానికి ₹2,369 మద్దతు ధరను నిర్ణయించారు. రైతులు తేమ శాతం, మట్టిపెంకులు, చెత్త ధాన్యాలు వంటి ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు.
తేమ శాతం 17%, మట్టి పెంకులు 1%, చెత్త ధాన్యాలు 5%, పగుళ్లు 3%, చిన్న గింజలు 6% వరకు అనుమతించనున్నట్లు తెలిపారు.
సాలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు అల్లే జనార్ధన్. మరియు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో బస్వంత్ రావు. మాట్లాడుతూ —
“రైతులు దళారుల జోక్యం లేకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి మద్దతు ధర పొందాలి” అని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, అధికారులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india