ప్రజలకు ఇబ్బంది పెడుతున్న వైన్ షాపు వెంటనే తొలగించండి
కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాకు సమీపంలో ప్రధానంగా బస్టాండ్ గా కొనసాగ పడుతున్న, బస్టాండ్‌కు సమీపంలో ఎ తొండ రోడ్డుకు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే వినాయక నగర్ కాలనీ లో దానికి ఎదురుగా మెడికల్ షాపు , ప్రాథమిక వైద్యశాలలు పోస్ట్ ఆఫీసులు, నిత్యం జనావాసుల తిరిగే ప్రదేశంలో వైన్ షాపు ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీన్ని వెంటనే తొలగించాలని కాలనీ ప్రజలు చెబుతున్నారు. ఈ వైన్ షాపు వల్ల ముఖ్యంగా మహిళలకు చిన్నపిల్లలకు విద్యార్థులకు యువతులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని ఈ టెండర్ ప్రక్రియ కాగానే వైన్ షాపును వెంటనే తొలగించి వినాయక నగర్ కాలనీ ప్రజలతో పాటు వాహనపుదారులకు ప్రజలకు ప్రయాణికులకు విముక్తి కల్పించాలని ప్రజలు అంటున్నారు. ఒకవేళ తొలగించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రజలు హెచ్చరికలు చేస్తున్నారు. వైన్ షాపులో మద్యం తాగుతూ పక్కనే మలమూత్రాలు చేయడం వల్ల ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని జనావాసల మధ్య వైన్ షాప్ ఉండడమేమిటని దీనిపై అధికారులకు కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు వినతిపత్రం ఇచ్చిన స్పందించడం లేదని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి వినతి పత్రాలు ఇస్తున్నప్పటికీ దీని తొలగించకపోవడం విడ్డూరంగా ఉందని ఇప్పటికైనా దీని పై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు అంటున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








