V1News Telangana

best news portal development company in india

బిఆర్ఎస్ నేతలకు గంగా శంకర్ సవాల్ . కిడ్నాప్ ఆరోపణలు అవాస్తవం – కాంగ్రెస్ ప్రతిస్పందన ఇసుక రవాణాలో షకీల్ కుటుంబమే ఉన్నారని ఆరోపణ . కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికలకు సిద్ధం

SHARE:

బోధన్ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి బిఆర్ఎస్ నేతలు వెనుకడుగు – గంగా శంకర్ 

కాంగ్రెస్ అభ్యర్థులు క్యూలో ఉన్నారు – బిఆర్ఎస్ ఆరోపణలు అవాస్తవం
ఇసుక అక్రమ రవాణా షకీల్ కుటుంబ సభ్యులే చేశారని ఆరోపణ

బోధన్ :
స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క నేత కూడా ముందుకు రావడం లేదని టిపిసిసి డెలిగేట్ గంగా శంకర్ విమర్శించారు. ఆదివారం బోధన్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గంగా శంకర్ మాట్లాడుతూ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ నాయకులపై కిడ్నాప్ ఆరోపణలు చేయడం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాజీ ఎమ్మెల్యే షకీల్ చేస్తున్న ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని అన్నారు.
అలాగే, అక్రమ ఇసుక రవాణా షకీల్ కుటుంబ సభ్యులే నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ, తక్కువ ధరలకు ఇసుక తరలింపు జరుగుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికలలో పోటీకి సిద్ధంగా ఉన్నారని, బిఆర్ఎస్ అభ్యర్థులు ధైర్యం ఉంటే బరిలోకి దిగాలని సవాల్ విసిరారు.
ఈ కార్యక్రమంలో బోధన్ కాంగ్రెస్ నాయకులు పాషా మోహినుద్దీన్, మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, శరత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, సాలూర మండల అధ్యక్షులు మందర్న రవి,, గణపతి రెడ్డి, తలారి నవీన్, తదితరులు పాల్గొన్నారు.

.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india