V1News Telangana

best news portal development company in india

కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు కోటగిరి లో మహిళలకు షీ టీం అవగాహన సదస్సు….

SHARE:

 నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు మహిళలకు వ నిజామాబాద్ షీ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో షి టీం కానిస్టేబుల్ రాధికా మాట్లాడుతూ మహిళలు మరియు బాలికల భద్రతను నిర్ధారించడం మా ప్రధాన లక్ష్యమని షి టీమ్ బాధితులకు బలమైన మద్దతు వ్యవస్థగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా ఫోన్ చేసి సమస్య తెలపాలని సూచించారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే అత్యాశకు పోయి సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు, లోన్ యాప్స్ కు మోసపోతున్నారని, వాటి జోలికి పోవద్దని సూచించారు. ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి సమాచారం ఇవ్వాలని సూచించారు. మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే 100 నంబర్ కు డయల్ చేయాలని చెప్పారు.కార్యక్రమంలో షీ టీమ్ హెడ్ కానిస్టేబుల్ అశన్న మరియు పోలీస్ ఎయస్ఐ బన్సిలాల్ కళాశాల ప్రిన్సిపాల్ పలువురు విద్యార్థినిలు పాల్గొన్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india