స్థానిక సంస్థల ఎన్నికలకు రోజులు దగ్గరవుతున్న కొద్దీ నిజామాబాదు జిల్లాలో నాయకులు ముందుగానే ఎ గ్రామం లో ఎంత ఖర్చవుతుందో ఒకో ఓటుకు ఎంత ఇవ్వాలి, మందు విక్రయలు ఎలా జరపాలి అనే ప్లాన్ ను మొదలు పెట్టారాట. ముందుగా జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు ఆ తరువాత సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి.అయితే కొన్ని మండలాల్లో జడ్పీటీసీ గా పోటీ చేసే అభ్యర్థులకు కోటి రూపాయల కంటే ఎక్కువగా ఖర్చుపెట్టిన అశ్చర్యపోవాల్సిన విషయం లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్పుకోస్తునారు. గడిచిన ఎన్నికలో అయిన ఖర్చుకంటే ఎక్కువ ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారట రాజకీయ నాయకులు. పోటీ చేయడానికి ఇంత డబ్బు ఎందుకు అవసరం అని మీకనిపించవచ్చు ఎన్నికలు రాంగానే డబ్బులు ఎవరిస్తారు మందు ఎక్కడ దొరుకుతుందని ప్రజలు ఊరుకులాడటం కొత్తదేమి కాదు ఎన్నికలో పెట్టిన డబ్బు తిరిగి పొందడానికి నాయకుడు ప్రజల దగ్గర వసూల్ చేయక తప్పని పరిస్థితి,రాజకీయం వ్యాపారం ల మారిందని దానికి కారణం ఓటు నోటు తీసుకొని వేయడం ప్రధాన కారణమని రాజకీయ మేధావులు చెబుతున్నారు.అయితే ఎన్నికలో పోటీ చేయడానికి సరిపడా డబ్బు లేకపోవడం తో తమకున్నా ఆస్తుల అమ్మకాలు జరిపి పోటీ చేసే ఆలోచనలో కొందరు నాయకులు ఉన్నారట. దర్జాగా డబ్బులు పంచాకున్నా అధికార వ్యవస్థ నిఘా కరువైన ప్రాంతాల్లో డబ్బు సరఫరా సులువుగా జరుగుతుందట. వాస్తవానికి కోట్లలో డబ్బులు ఖర్చు పెడతారా గెలవడానికి డబ్బు అవసరమా లేక ఇవి ఆరోపణలు మాత్రమే వేచి చూడాల్సిందే అంటున్నారు స్థానిక ప్రజలు.
Author: IRFAN Reporter
Work from as a journalist








