V1News Telangana

best news portal development company in india

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ ఖరారు!*

SHARE:

హైదరాబాద్:అక్టోబర్ 06

తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూలు విడుదల అయింది నవంబర్ 11న ఉప ఎన్నిక నవంబరు 14న ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్, వెల్లడించారు.జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తం 3,92, 66 9 మంది ఓటర్లు ఉన్నారు.

హైదరాబాద్‌మహా నగరం లో ఉన్న ఈ నియోజకవర్గం ఆర్థికంగా, సామాజికంగా అత్యంత ముఖ్యమైనది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, గత ఎన్నిక ల్లో గెలిచిన బీఆర్‌ఎస్‌కు ఈ స్థానం అత్యంత కీలకం. ఈ ఎన్నికల ఫలితం రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంది.

ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వం జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేసి.. నలుగురు కీలక నేతలతో కూడిన సంక్షిప్త జాబితాను ఏఐసీసీ కి పంపింది. ఈ జాబితాలో నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ వంటి నేతల పేర్లు ఉన్నా యి. కాంగ్రెస్ అధిష్ఠానం త్వరలోనే తుది అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

బీఆర్‌ఎస్, బీజేపీ వైఖరి..
ముఖ్య ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఈ ఉపఎన్నికలో తమ సిట్టింగ్ బలాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు టికెట్‌ను కేటాయించారు. ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ తమదైన శైలిలో పోటీని పెంచేందుకు సమాయత్త మవుతోంది. అభ్యర్థి ఎంపిక కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

ఇలా జూబ్లీహిల్స్‌లో త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది. ఈ ఉపఎన్నికలో విజయం సాధిస్తే.. అది రాష్ట్రంలో ఏ పార్టీ ప్రజల ఆమోదాన్ని కలిగి ఉందో రుజువు చేస్తుంది.మరో ముఖ్యమైన రాజకీయ పరిణామం ఏమిటంటే.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఉన్న న్యాయ వివాదం.

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా కీలక మంత్రులు 42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో బలమైన వాదనలు వినిపిం చడం కోసం ఢిల్లీలోని సీనియర్ న్యాయవాదు లతో చర్చలు జరపడం, రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీల మద్దతు పొందడానికి కాంగ్రెస్ చేస్తున్న వ్యూహా త్మక ప్రయత్నంగా కనిపిస్తోంది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india