V1News Telangana

best news portal development company in india

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం….

SHARE:

 

– గురువులకు ఘనంగా సత్కారం, విద్యార్థి దశలో వారితో పెనవేసుకున్న అనుబంధాలు పదిలం

 

– చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకొని మురిసిపోయిన పూర్వ విద్యార్థులు

 

– ఆత్మీయంగా పలకరించుకొని సాధక- బాధకాలు పంచుకున్న వైనం

 

– ఆటపాటలతో అలరించి సహ భక్తి భోజనాలు చేసి అనంతరం ఇళ్లకు తిరుగుపయనం

 

నసురుల్లాబాద్ ప్రతినిధి:

 

V1 న్యూస్, అక్టోబర్ (06) కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల పరిధిలోని బొమ్మన్ దేవ్ పల్లి గ్రామంలో ఆదివారం రోజు 1995-96 సంవత్సరంలో ఏడవ తరగతి విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆనాడు తమకు విద్య బుద్ధులు, క్రమశిక్షణ బోధించిన ఉపాధ్యాయులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పరస్పరం మిఠాయిలను తినిపించుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థి దశలో ఉపాధ్యాయులతో ఏర్పడిన అనుబంధాన్ని, అనుభవాలను గుర్తుచేసుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఒక్కసారిగా బాల్యంలోని జ్ఞాపకాలను నెమరు వేసుకుని మురిసిపోయారు.. ఆట,పాటలతో ఆనందంగా గడిపారు. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేసి తిరుగుపయనమయ్యారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india