V1News Telangana

best news portal development company in india

బిజెపి కార్యకర్తలు ఎటువంటి మాయమాటలకు,ప్రలోభాలకు గురికాకూడదు….

SHARE:

 

 

– జిల్లా పదవులు ఉన్నట్లు కార్యకర్తలను నమ్మించే ప్రయత్నం చేస్తున్న నాయకులపై విమర్శలు

 

– నూతన జిల్లా కమిటీ పదవులు ప్రకటించే వరకు ఎవరి మాటలు నమ్మవద్దని కార్యకర్తలకు విజ్ఞప్తి

 

– బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ

 

రుద్రూర్ ప్రతినిధి:

 

V1 న్యూస్, అక్టోబర్ (06) నిజామాబాద్ జిల్లా : భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ విజ్ఞప్తి చేస్తూ పలు విషయాలను ప్రస్తావించారు. ఇటీవల రాష్ట్ర నూతన అధ్యక్షుడి నియామకం అనంతరం బిజెపి రాష్ట్ర అధిష్టానం ప్రకటించినటువంటి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.రాష్ట్ర,జిల్లా కమిటీ నియామకాలు జరిగిన తర్వాత అప్పటివరకు కొనసాగిన పదవులు అన్ని రద్దు అయినట్లేనని స్పష్టం చేశారు. నూతనంగా నియమించబడిన రాష్ట్ర, జిల్లాల మోర్చాల అధ్యక్షులు నూతన కమిటీలు ఏర్పాటు చేసేంతవరకు ఎవరూ ఎటువంటి పదవులలో కొనసాగుతున్నట్లు ప్రకటించుకోవద్దని భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఘంటాపదంగా తెలియజేశారని అన్నారు. రుద్రూర్ మండలానికి చెందిన భూషిగం సుధాకర్ గౌడ్ అనే వ్యక్తి నియోజకవర్గం లో తాను ఇందూర్ జిల్లా ఓబీసీ ప్రధానకార్యదర్శి ని అని పలువురికి చెప్పుకుంటూ నియోజకవర్గం లో స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవులకు పోటీ చేసే కార్యకర్తలకు బిజెపి పార్టీ తరఫున బిఫారం లు ఇప్పిస్తానని ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు ఆయన దృష్టికి రావడం జరిగిందని పేర్కొన్నారు.ఈ విషయాన్ని బిజెపి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి అతనికి ఇందూరు జిల్లా నుండి బిజెపి పార్టీ తరపున ఎటువంటి పదవి లేదని సూచించారని తెలిపారు. అందువలన నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు కార్యకర్తలు మాయ మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.నియోజకవర్గం లోని కార్యకర్తలు రాష్ట్ర అధిష్టానం మళ్ళీ నూతన పదవులు ప్రకటించే వరకు దయచేసి ఎవరి మాటలు నమ్మొద్దని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india