V1News Telangana

best news portal development company in india

హోరాహోరీగా సాగిన క్రికెట్ టోర్నమెంట్….

SHARE:

 

 

– యువత క్రీడల్లో నైపుణ్యంతో రాణించాలి

 

– ప్రోత్సాహంలో భాగంగా క్రికెట్ పోటీలు నిర్వహించినట్లు వివరణ

 

– టోర్నమెంట్ నిర్వాహకులు దరఖాస్తుల శ్రీనివాస్

నసురుల్లాబాద్ ప్రతినిధి:

 

V1 న్యూస్ అక్టోబర్ (04)కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామం లో దసరా పండగ సెలవుల సందర్భంగా యువతను క్రీడలలో ప్రోత్సహించడానికి దరఖాస్తుల శ్రీనివాస్ అనే యువకుడు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో 5 టీమ్ లు పాల్గొని పోటీలు ఆసక్తిగా ఉత్కంఠ భరితంగా సాగాయి. గ్రామస్తులు , యువకులు అధిక సంఖ్యలో పాల్గొని పోటీలను తిలకించారు. ఈ పోటీలలో మిర్జాపూర్ గ్రామానికి చెందిన టీం ప్రథమ బహుమతి కైవసం చేసుకోగా.. వీరాపూర్ గ్రామానికి చెందిన టీం ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్నారు. ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన జట్లకు దరఖాస్తుల శ్రీనివాస్ బహుమతులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువులతో పాటు క్రీడలలో కూడా రాణించాలని అన్నారు.క్రీడలు ఆడడం వలన శరీరం ఉస్తాహంగా, దేహ ధారుడ్యాన్ని కలిగి ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బంజ నాగు పటేల్, బాలకృష్ణ, లాలయ్య, రాజు, హుస్సేన్, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india