Post Views: 107
కోటగిరి
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో బస్టాండ్ కి ఆనుకొని ప్రధాన రహదారి పక్కనే వినాయక నగర్ లో కాలనీ ప్రజలకు ఇబ్బంది కల్పిస్తున్న వైన్ షాపును వెంటనే తొలగించాలి అంటూ కాలనీ ప్రజలు తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. వైన్ షాపు తొలగించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ వైన్ షాపు ప్రధాన రహదారి పక్కన ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మలమూత్రాలు కాలనీకి దగ్గర్లో చేయడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాలనీ ప్రజలకు న్యూసెస్ గా ఉన్న వైన్ షాపును వెంటనే తొలగించాలని అన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








