– పోతంగల్ మండల బిజెపి సీనియర్ నాయకులు మార్కెలి ప్రకాష్ పటేల్
పోతంగల్ ప్రతినిధి:
V1 న్యూస్ అక్టోబర్(01) నిజామాబాద్ జిల్లా:పొతంగల్ మండలంలో మండల అధ్యక్షులు హన్మండ్లు అధ్యక్షతన బిజెపి ఎన్నికల సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల ఇంచార్జ్ గా తిప్ప కాయల కిషోర్(కార్పొరేటర్) హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన పోతంగల్ మండలానికి బాన్సువాడ నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉందని ఇక్కడ భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉందని, స్థానిక సంస్థల ఎన్నికలలో పూర్తి మెజార్టీతో విజయం సాధించి జడ్పిటిసి, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుని జిల్లా పరిషత్ లో ముఖ్యపాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ నాయకులు ప్రకాష్ పటేల్, విజయ్ పటేల్, గంగాధర్ పటేల్, జిల్లా కౌన్సిల్ మెంబర్ మక్కయ్య, నియోజకవర్గ ఓబిసి కన్వీనర్ నాగం సాయిలు,వివిధ మోర్చాల అధ్యక్షులు రాజు పటేల్ (OBC), హరి నర్సింగ్(కిసాన్ నయీముద్దీన్(మైనార్టీ), మండల బీజేవైఎం నాయకులు శంకర్, వివిధ బూత్ అధ్యక్షులు ,మండల సీనియర్ నాయకులు దిగంబర్ పటేల్, పబ్బ శేఖర్, నాగనాథ్ పటేల్ , మాగిరి శ్రీనివాస్ ,కిరణ్ సెట్ , సంజు మహరాజ్, గంధపు హన్మండ్లు, ఓమన్న పటేల్, గంధపు మోహన్, మేదరి రాములు, గంట్ల శ్రీను, సంతోష్ పటేల్, బొంబాయి శంకర్, ముత్యాల రాజు, రాజు పటేల్, వెంక గౌడ్, మారుతి పటేల్ ,సాయినాథ్ , బసంత్ , శంకర్ ,విజయ్, వసంత్ రావు, గజ్జు,వెంకట్రావు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








